జేఎన్టీయూలో ముగిసిన హ్యాకథాన్
రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో చేపట్టిన ఎకో హ్యాకథాన్ కార్యక్ర మం శుక్రవారం ముగిసింది. నేషనల్ గ్రీన్‌క్రాప్ హ్యాకథాన్ పోటీలకు 22 టీంలతోపాటు మంథని జేఎన్టీయూ, పెద్దపల్లి ట్రినిటి కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 8 బృందాలు ఫైనల్ పో టీలకు ఎంపికయ్యాయి. జడ్జిలుగా శ్రీధర్‌రెడ్డి, సా హు ఛత్రపతి వ్యవహరించారు. ప్రథమ విజేతగా మహవర్ధన్, ద్వితీయ విజేతగా రాజ్‌కుమార్, తృతీ య విజేతగా ట్రినిటి కళాశాల శివానీ టీమ్ ఎంపికయ్యాయి. ప్రథమ బహుమతికి రూ.5వేలు, ద్వితీ య బహుమతికి రూ.3 వేలు, తృతీయ బహుమతికి రూ.వెయ్యి, హ్యాకథాన్‌లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్, కో ఆర్డినేటర్లు సదానందం, శివకృష్ణ, కావ్య, రాజేశ్, మహిపాల్, సాయిదీక్షిత్, నరహరి, వంశీకృష్ణ పాల్గొన్నారు.


