తమిళనాడు గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
మంథని: కార్తీక పౌర్ణమి సందర్భంగా వచ్చే నెల 5న తమిళనాడులోని అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు మంథని నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. వచ్చే నెల 3న సాయంత్రం మంథని నుంచి బయలుదేరి కరీంనగర్, హైదరాబాద్ మీదుగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం 4న రాత్రి అరుణాచలం చేరుకుంటుందన్నారు. 5న సాయంత్రం అరుణాచలం నుంచి బయలు దేరి 6న శ్రీఅలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం తర్వాత కరీంనగర్ మీదుగా మంథని చేరుకుంటుందన్నారు. ఫుల్ టికెట్ రూ.5,040, ఆఫ్ టికెట్ రూ. 3,790 ఉంటుందన్నారు. టికెట్ బుకింగ్ కోసం 99592 25923, 99486 71514 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఓదెల(పెద్దపల్లి): ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను వేగవంతం చేయాలని డీపీవో వీరబుచ్చయ్య పేర్కొన్నారు. గురువారం మండలంలోని శానగొండలో ఇందిరమ్మఇళ్ల నిర్మాణాలతో పాటు కమిటీ సభ్యులు, కార్యదర్శులతో మాట్లాడారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు పూర్తి చేసేలా చూడాలన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు నవంబర్ చివరివరకు వందశాతం పన్ను వసూలు చేయాలన్నారు. ఎంపీడీవో తిరుపతి, ఎంపీవో షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ కార్మిక సంఘంతో చర్చలు విఫలం
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా విధులు బహిష్కరించారు. గురువారం ఆర్‌ఎఫ్‌సీఎల్ సర్కిల్ నుంచి ప్లాంట్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు, కార్మికులకు, ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యానికి మధ్య చర్చలు నిర్వహించారు. చర్చలు విఫలం కావడంతో కార్మికులు వెనుతిరిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని కాంట్రాక్ట్ కార్మికులు హెచ్చరించారు. కాగా, సమస్యలు పరిష్కరించాలని రెండు రోజులు నిరసన తెలిపినా యాజమాన్యం స్పందించకపోవడంతో సుమారు 300 మంది కాంట్రాక్టు కార్మికులు తమ వేతనాన్ని నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనాలి
పెద్దపల్లి: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో తడిసిన ధాన్యాన్ని గురువారం పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా పత్తి, కూరగాయలసాగు, మొక్కజొన్న, వరి తడిసి ముద్దయిందని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ బోయిరి రాజమల్లు, విండో చైర్మన్ సందీప్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తమిళనాడు గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
తమిళనాడు గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు


