మెడికో స్టూడెంట్స్ ధైర్యంగా ఉండాలి
కోల్‌సిటీ(రామగుండం): వైద్య విద్యలో తొలి అడుగు వేస్తున్న ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థులు ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. గోదావరిఖనిలోని సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) కాలేజీలో గురువారం ఎంబీబీఎస్ ఫస్టియర్ స్టూడెంట్స్ కోసం నిర్వహించిన వైట్ కోట్ వేడుకతోపాటు క్యాడావరిక్ ఒత్ కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. రాబోయే నాలుగైదేళ్లు మెడికోల జీవితంలో చాలా కీలకం కాబోతుందని, చాలా సార్లు నిరుత్సాహపడే పరిస్థితులు రావచ్చని, ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకం, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు. సిమ్స్ కాలేజీలో మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. రెండున్నరేళ్లుగా స్టూడెంట్స్ పడిన కృషి ఫలితంతోనే, నేడు వైట్ కోట్ వేడుకలో పాల్గొంటున్నారని కొనియాడారు.
మొదటి గురువు ‘శరీరదాత’కు గౌరవం
అనాటమీ డిపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన క్యాడావరిక్ ఒత్ కార్యక్రమంలో భాగంగా మెడికల్ కాలేజీకి శరీరదానం చేసిన దాతకు గౌరవం తె లు పుతూ, దాత శరీరాన్ని మొదటి గురువుగా భావిస్తామని, మానవ శరీర ని ర్మాణం నేర్చుకునే సమయంలో గౌరవభావంతో వ్యవహరించాలని మె డికో స్టూడెంట్స్‌తో కలెక్టర్, ప్రిన్సిపాల్ వాగ్దానం చేయించారు. హెడ్‌వోడీలు, ప్రొఫెసర్లు లావణ్య, ప్రదీప్‌చంద్ర, భానులక్ష్మి, ఫరీద్, అనూష, రాజు, శిరీష, రవివర్మ, హర్షిణి, ఓబులేశ్, కల్పన, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఫస్టియర్ మెడికోలు
మెడికో స్టూడెంట్స్ ధైర్యంగా ఉండాలి


