బొగ్గు రవాణాపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

బొగ్గు రవాణాపై ప్రత్యేక దృష్టి

Jul 28 2025 7:29 AM | Updated on Jul 28 2025 7:29 AM

బొగ్గ

బొగ్గు రవాణాపై ప్రత్యేక దృష్టి

గోదావరిఖని: సింగరేణి యాజమాన్యం బొగ్గు రవాణాను మరింత వేగవంతం చేయడంపై దృష్టి సారించింది. బొగ్గు ఉత్పత్తి చేయడం ఒక ఎత్తయితే.. వెలికితీసిన బొగ్గును వినియోగదారులకు సకాలంలో అందించడం మరోటాస్క్‌గా మారుతోంది.

రవాణా లక్ష్యం 70 మిలియన్‌ టన్నులు

సింగరేణి యాజమాన్యం ఈఏడాది 70 మిలియన్‌ టన్నుల బొగ్గును రైల్వే మార్గం ద్వారా రవాణా చే యాలని నిర్ణయించింది. సంస్థ సాధించే ఉత్పత్తిలో అత్యధికశాతం రైల్వే మార్గం ద్వారా వినియోగదారులకు చేరవేస్తోంది. ఈక్రమంలో రైల్వే, సింగరేణి మధ్య అనుసంధానంగా ఉండేందుకు రైల్వేట్రాఫిక్‌ సర్వీస్‌(ఐఆర్‌టీఎస్‌) అధికారిగా బి.వెంకన్నను కో ల్‌మూమెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ)గా నియమించింది. డిప్యూటేషన్‌పై క్యాబినెట్‌ అపాయింట్‌మెంట్‌ కమిటీ ఈమేరకు ఆమోదించింది. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు.

విద్యుత్‌ సంస్థలకు అధికంగా..

దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన విద్యుత్‌ సంస్థలకు సింగరేణి సంస్థ బొగ్గు అందిస్తోంది. దీనిని రైల్వేరేక్‌ల ద్వారా వినియోగదారులకు వేగంగానే సరఫరా చేస్తోంది. ఈక్రమంలో సింగరేణిలో కోల్‌మూమెంట్‌ ఈడీ పోస్టు కీలకంగా మారింది. ప్రస్తుతం సంస్థ వ్యాప్తంగా రవాణా అవుతున్న బొగ్గును రైల్వే ద్వారా అందించడం, రైల్వేతో అనుసంధానంగా ఉంటూ రైల్వే రేక్‌లను కేటాయించాల్సి ఉంటోంది. ఈ పనులన్నీ కోల్‌మూమెంట్‌ ఈడీ పర్యవేక్షణలోనే కొనసాగుతాయి.

ఈఏడాదిలో 98శాతం రవాణా

సింగరేణి సంస్థ గనుల్లో తవ్వితీసిన బొగ్గులో 98 శాతం బొగ్గును రైల్వే ద్వారా రవాణా చేసింది. ఇప్పటివరకు 19.23 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, 18.98 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా చేసింది. నిర్దేశిత లక్ష్యాల్లో 98శాతంగా నమోదు చేసింది. ఇదే క్రమంలో గతేడాది 19.93 మిలియన్‌ టన్నులు బొగ్గు రవాణా చేయగా ఈసారి 9.50 లక్షల టన్నులు వెనుకబడింది. గతేడాదికన్నా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు పెంచడం, రవాణాలో గతేడాదికన్నా తగ్గడంపై యాజమాన్యం దృష్టి సారించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా లక్ష్యంగా నిర్దేశించగా, 69 మిలియన్‌ టన్నులు సరఫరా చేసి నిర్దేశిత లక్ష్యాల్లో 95శాతం నమోదు చేసింది.

వర్షాకాలం.. గడ్డుపరిస్థితులు..

సింగరేణి సంస్థలో 80శాతం బొగ్గును ఓసీపీల ద్వారానే ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టు(ఓసీపీ)ల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు రవాణా చేయడం కూడా కష్టంగా మారుతుంది. ఈక్రమంలో వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సకాలంలో అందించడమే లక్ష్యంగా యాజమాన్యం ముందుకు సాగడం కొంత కష్టంగానే ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఈ సమస్య వర్షాకాలం ముగిసేదాకా.. అంటే.. సుమారు మూడు నెలలపాటు ఉంటుందని భావిస్తున్నారు.

సింగరేణిలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు రవాణా(మిలియన్‌ టన్నుల్లో)

లక్ష్యం మేరకు తరలింపు

జోరుగా కురుస్తున్న వర్షాలు

ఓసీపీల్లో ఉత్పత్తి తగ్గే అవకాశం

మూడు నెలలపాటు ఇదే పరిస్థితి

లక్ష్యం రవాణా శాతం

19.23 18.98 98

బొగ్గు రవాణాపై ప్రత్యేక దృష్టి 1
1/1

బొగ్గు రవాణాపై ప్రత్యేక దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement