
అన్నదాతకు కూలీల కొరత
మంథనిరూరల్: పత్తి సాగు చేసే రైతుకు ఏటా పరేషాన్ తప్పడం లేదు. విత్తనాలు నాటిన తర్వాత వర్షాభావ పరిస్థితులు నెలకొనడమో.. అవసరానికి మించి వానలు కురువడమో.. లేదా ఇతర పరిస్థితులో తెలియదు కానీ.. పంటలో ఏపుగా పెరుగుతున్న కలుపు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఓ వైపు కూలీల కొరత.. మ రోవైపు అవసరాన్ని మించి వానలు పత్తి రైతును ఆగం చేస్తూనే ఉన్నాయి. నాలుగు రోజులపాటు కురిసిన ఎడతెరిపిలేని వానలు కూడా ప్రస్తుతం జిల్లారైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కూలీల కొరతతో..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం పత్తి పంటలో కలుపు పెరుగుతోంది. దానిని తొలగించడం రైతులకు తలకు మించిన భారమవుతోంది. వర్షాకాలంలో కూలీల కొరత వారిని ఆందోళనలకు గురిచేస్తోంది. ఇదే సీజన్‌లో ఉపాధిహామీ ద్వారా ప్రభుత్వం చేపట్టే వనమహోత్సవంలో మొక్కలు నాటేందుకు కూలీలు వెళ్తుంటారు. వరినాట్లు సైతం ముమ్మరం అవుతాయి. ఈ క్రమంలో పత్తిలో కలుపు తీసేందుకు కూలీల కొరత ఏర్పడుతూనే ఉంటుంది.
ఇతర ప్రాంతాల నుంచి..
స్థానికంగా కూలీలు దొరకక ఇతర ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నారు. పత్తి పంటలో కలుపు తీస్తే ఒక్కొక్క కూలీకి రోజూ రూ.300 కూలి చెల్లిస్తారు. స్థానికేతర కూలీలను తీసుకొస్తే రవాణా చార్జీలు భరించాల్సి వస్తోంది. ఇది రైతులకు అదనపు ఆర్థిక భారమే.
ముసురువానలతో..
మోతాదులోనే వర్షం కురిస్తేనే పత్తి పంటకు మేలు కలుగుతుంది. అతిగా కురిసినా నష్టమే వస్తుందని అన్నదాతలు అంటున్నారు. నాలుగు రోజులపాటు కురిసిన ముసురుతో జిల్లాలోని అనేక గ్రామాల్లో పత్తి చేనుల్లో వరద నిలిచి చేను జాలువారి పోతోంది. మొక్కలు ఎర్రబారిపోతున్నాయి. రోజుల తరబడి నీళ్లలోనే మొక్క ఉండడం ఇందుకు కారణమని వ్యవసాయాధికారులు అంటున్నారు. కాగా, యాజమాన్య పద్ధతులు పాటిస్తే ముసురు వానల ముప్పు నుంచి పత్తి పంటను కాపాడుకోవచ్చని వ్యవసాయాధికారులు వివరిస్తున్నారు.
కలుపుతీత వేళ తీవ్రమైన సమస్య
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి
మంథని మండలంలోసాగువివరాలు(ఎకరాల్లో)
సాగు అంచనా 8,000
సాగైంది 5,000
ఎర్రబడినది(సుమారు) 50
కూలీలు దొరుకతలేరు
పత్తిలో కలుపు ఏరేందు కు కూలీలు దొరుకతలే దు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాలంటే రవాణా ఖర్చు మీద పడుతంది. నేను ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేసిన. కలు పు బాగా పెరిగింది. కలుపు తీసేందుకు కూలీలు దొరకక ఇబ్బంది అయితాంది.
– తాళ్లపల్లి సత్యవతి, రైతు, గుంజపడుగు

అన్నదాతకు కూలీల కొరత

అన్నదాతకు కూలీల కొరత