
రింగ్‌రోడ్‌తో ప్రజాధనం వృథా
మంథని: ప్రజాధనాన్ని వృథా చేయడానికే రూ.300 కోట్లు వెచ్చించి రింగ్‌రోడ్ నిర్మాణం చేపడుతున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని కూచిరాజ్‌పల్లి సమీపంలో రెండురోజుల క్రితం రింగ్‌రోడ్ నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేసిన స్థలంలో గురువారం మీడియాతో మాట్లాడారు. కూచిరాజ్‌పల్లి సమీపంలో రియల్ ఎస్టేట్‌ను ప్రోత్సహించేందుకే రింగ్‌రోడ్‌ను తీసుకువచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో 38 కి.మీ మేర గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి పనులు జరుగుతున్నాయని, అడవిశ్రీరాంపూర్, బేగంపేట, పుట్టపాక, పోతారంలో ఇంటర్‌చేంజ్‌లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రింగ్‌రోడ్‌తో ప్రయోజనం ఏంటో ఆలోచన చేయాలన్నారు. హైవే నిర్మాణం జరిగితే పెద్దపల్లి నుంచి వచ్చేవారు హైవే ద్వారా గోదావరినది అవతలికి వెళ్లే అవకాశాలు ఉ న్నాయని, రింగ్‌రోడ్డు మాత్రం శివ్వారం వరకు మా త్రమే ఉంటుందని, మళ్లీ చెన్నూర్‌లాంటి ప్రాంతా లకు వెళ్లాలంటే 20–30 కి.మీ ప్రయాణం చేయాల్సి వస్తుందని వివరించారు. తాము అభివృద్ధికి వ్య తిరేకం కాదని, ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేయాలని పేర్కొన్నారు. నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, మాచిడి రాజుగౌడ్ తదితరులు ఉన్నారు.