● ఇప్పటికే అనేకసార్లు మరమ్మతు ● అయినా, తరచూ పైప్‌లైన్
కోల్‌సిటీ(రామగుండం): అభివృద్ధి పనుల విషయంలో పారదర్శకత లోపిస్తుందడానికి ఈ చిత్రమే సాక్ష్యంగా నిలుస్తోంది. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని దుర్గానగర్ కాలనీ బోర్డు ఎదుట.. ప్రధాన రహదారిపై మంగళవారం వాటర్ పైప్‌లైన్ లీక్ అయ్యింది. తాగునీరు పెద్ద ఎత్తున రోడ్డపైకి వచ్చి చేరింది. తాగునీరంతా వృథాగా పోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకసారి కాదు..
ఈ ప్రాంతంలో పైపులైన్ మంగళవారం ఒక్కరోజే లీక్‌కాలేదు. ఇదేచోట ఇప్పటికే అనేకసార్లు పైప్‌లైన్ లీకై ంది. ప్రైవేట్ వ్యక్తులతో అనేకసార్లు మరమ్మతు చేశారు. ఇందుకోసం నిధులు ఖర్చు చేస్తున్నా.. లీకేజీ ఆగడం లేదు. నెల క్రితం ఇదేప్రాంతంలో అధికారులు మరమ్మతు చేయించారు. మంగళవా రం మరోసారి లీకేజీ ఏర్పడింది. 250 డయా సామర్థ్యం కలిగిన వాటర్ పైప్‌లైన్‌కు అమర్చిన జాయింట్ వద్దే తరచూ లీకేజీ సమస్యలు ఏర్పడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపమా? లేక సాంకేతిక పద్ధతిలో మరమ్మతు చేపట్టడం లేదా? లేదా మరమ్మతుల్లో నాసిరకం సామగ్రి వినియోగిస్తున్నారా? అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో అనేక కాలనీల్లో మరమ్మతులు చేసిన ప్రాంతంలోనే వాటర్ పైప్‌లైన్లకు లీకేజీలు ఏర్పడుతున్నాయి. లీకేజీలతో రోడ్లు డ్యా మేజీ కావడంతోపాటు సమీప నివాసాలకు కలుషితమైన తాగునీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించాలని నగరవాసులు కోరుతున్నారు.
● ఇప్పటికే అనేకసార్లు మరమ్మతు ● అయినా, తరచూ పైప్‌లైన్


