
ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: తల్లిదండ్రులు తమ పిల్లలను స ర్కార్ బడుల్లోనే చేర్పించాలని కలెక్టర్ కోయ శ్రీహ ర్ష కోరారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికోన్నత, బాలుర ఉన్నత పాఠశాలలను అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి శనివారం ఆయన సందర్శించా రు. అభివృద్ధి పనులపై ఆరా తీశారు. విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులను ఒప్పించి వారి నమోదు పెంచాలని ఉపాధ్యాయులకు సూ చించారు. బాలికోన్నత పాఠశాలలో స్టేజీ నిర్మించా లని హెచ్‌ఎం అరుణ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చార. ప్రతిపాదనలు రూపొందించాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జెడ్పీ బాలుర పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. మైదానంలో వర్షపు నీరు నిలిచి ఇబ్బంది పడుతున్నామని, నీళ్లు ఆగకుండా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎం సురేందర్ కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా.. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తహసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ధరణి అర్జీలపై ఆరా తీశారు. పెండింగ్‌కు గల కారణాలను తహసీల్దార్ రాజ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.