
వరకట్నం వేధింపులతోనే ఆత్మహత్య
సుల్తానాబాద్‌రూరల్: నీరుకుల్ల గ్రామానికి చెందిన చిక్కులపల్లి నిర్మల ఈనెల 19న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం పోస్ట్‌మార్టం చేశాక మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఏసీపీ ఆస్పత్రిలో విచారణ జరిపారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బపూర్ గ్రామానికి చెందిన నిర్మలను సుల్తానాబాద్ మండలం నీరుకుల్లకు చెందిన తిరుపతిరావు ఇచ్చి నాలుగేళ్లక్రితం వివాహం జరిపించారని ఏసీపీ తెలిపారు. రెండేళ్లపాటు వీరి సంపారం బాగానే ఉన్నా.. ఆ తర్వాత అదనంగా కట్నం కావాలని భర్త శారీరకంగా వేధించడంతో తల్లిగారు రూ.20లక్షలు ఇచ్చారు. మరో రూ.4లక్షలు కావాలని మళ్లీ వేధించేవాడు. ఈక్రమంలో మానస్తాపం చెందిన నిర్మల వ్యవసాయ బావిలో దూకి అత్మహత్య చేసుకుంది. మృతురాలి అన్న బాపురావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త తిరుపతిరావు, బావ చందర్‌రావు, తొడికోడలు పద్మ, ఆడపడచు రజితపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరిచారు. తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
వివాహిత బలవన్మరణం ఘటనలో నలుగురిపై కేసు