లాభాలెన్ని.. వాటా ఎంత? | - | Sakshi
Sakshi News home page

లాభాలెన్ని.. వాటా ఎంత?

May 19 2024 7:35 AM | Updated on May 19 2024 7:35 AM

లాభాల

లాభాలెన్ని.. వాటా ఎంత?

● ఇప్పటికీ స్పష్టత ఇవ్వని సింగరేణి యాజమాన్యం ● 2023–24 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి ● పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత లాభాలు తేల్చే అవకాశం!

గోదావరిఖని: గత ఆర్థిక సంవత్సరం ముగిసి సుమారు 47రోజులు గడిచింది. 2023–24లో నిర్దేశిత 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించింది. బొగ్గు ఉత్పత్తి గణాంకాలు పూర్తయ్యా యి. అయినా, ఆర్థిక గణాంకాలపై ఇంకా స్పష్టత రాలేదు. వార్షిక లాభాలతో కార్మికుల వాటా ముడిపడి ఉంది. దీంతో సంస్థ ఎన్ని లాభాలు ఆర్జించింది? అందులోని వాటాగా తమకు ఎంత వస్తుందనే ఆశతో సింగరేణి కార్మికులు ఎదురుచూస్తున్నారు.

ఏటా నిర్దేశిత లక్ష్యం సాధిస్తూ..

● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఏటా నిర్దే శిత బొగ్గు ఉత్పత్తి, విద్యుత్‌ ఉత్పత్తి సాధిస్తూ, ఆర్థిక నివేదికలు సమర్పిస్తూ వస్తోంది.

● ఈ క్రమంలోనే 2023–24 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించగా.. 70.02 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది.

● వార్షిక టర్నోవర్‌ సుమారు రూ.37వేల కోట్ల మేర ఉంటుందని భావిస్తున్నారు.

● 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.33వేల టర్నోవర్‌ సాధించి రూ. 2,222 కోట్ల ఆదాయం ఆర్జించింది.

● అప్పటికన్నా ఈసారి బొగ్గు ఉత్పత్తితోపాటు టర్నోవర్‌ కూడా పెరిగింది.

● దీంతో సింగరేణికి లాభాలు కూడా అధికంగానే వచ్చాయని భావిస్తున్నారు.

● ఈక్రమంలో ఈసారి కార్మికులకు లాభాలు ఎక్కువగా వస్తాయని ఆశపడుతున్నారు.

ఖరారు చేసేది సీఎం..

సింగరేణి యాజమాన్యం ఏటా ఆర్జించే లాభాలను ప్రకటించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. అందులో కార్మికులకు లాభాల వాటా రాష్ట్ర ముఖ్యమంత్రి ఖరారు చేస్తారు. ఇదేవిషయంపై ప్రకటన చేయడం ఆనవాయితీ. ఈక్రమంలో ఈసారి లాభాలు ఖరారు అయితే లాభాల వాటా ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది 32శాతం కార్మికుల లాభాల వాటా ఉండగా, ఈసారి అది మరింత పెంచే అవకాశాలు ఉంటాయని కార్మికులు భావిస్తున్నారు.

వేగంగా ఇంటర్నల్‌ అడిట్‌..

● సింగరేణి సీఎండీ బలరాం స్వతహాగా ఫైనాన్స్‌ డైరెక్టర్‌.

● దీంతో లాభాల వాటాపై ప్రత్యేక దృష్టి సారించారు.

● సాధ్యమైనంత త్వరగా లాభాల విషయం తేల్చే పనిలో ఉన్నారు. దీంతో సంబంధిత అధికారులు ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు.

● సింగరేణి వార్షిక టర్నోవర్‌, లాభాలపై కసరత్తు వేగంగా సాగుతోంది.

● దీని కోసం ఇంటర్నల్‌ ఆడిట్‌ నిర్వహిస్తున్నారు.

● స్టాట్యుటరీ అడిట్‌ ద్వారా వెరిఫై కూడా కొనసాగుతోంది.

● ఈసారి వార్షిక లాభాలు రూ.3వేల కోట్లకు పైగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

8 ఏళ్లలో

సింగరేణి సాధించిన వాస్తవ లాభాలు

ఏడాది

లాభాలు

వాటా

(శాతంలో)

చెల్లించింది

(రూ. కోట్లలో)

2015–16 1,001.17 23 230.26

2016–17 395.38 25 98.84

2017–18 1,212.00 27 327.27

2018–19 1,766.00 28 493.00

2019–20 993.00 28 278.04

2020–21 272.20 29 79.06

2021–22 1,227.00 30 368.00

2022–23 2,222.00 32 711.00

ఎన్నికల కోడ్‌ ముగిశాకే..

సింగరేణిలో ఆడిట్‌ వేగంగా సాగుతోంది. ఇంటర్నల్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే నెల 4వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుంది. కోడ్‌ ముగిశాకే సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక అందజేస్తాం. ఆ తర్వాత ఆయన లాభాల వాటా ప్రకటించే అవకాశం ఉంది.

– బలరాం, సింగరేణి సీఎండీ

లాభాలెన్ని.. వాటా ఎంత? 1
1/2

లాభాలెన్ని.. వాటా ఎంత?

లాభాలెన్ని.. వాటా ఎంత? 2
2/2

లాభాలెన్ని.. వాటా ఎంత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement