
వీర రాఘవమ్మ(ఫైల్)
● భార్య మృతి
రామగిరి: కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. భార్య మృతిచెందింది. కల్వచర్ల పంచాయతీ ప్రశాంత్‌నగర్‌లో ఉప్పులూరి వీర్రాజు, వీర రాఘవమ్మ(55) దంపతులు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీర్రాజు కొద్దికాలంగా మద్యానికి బానిస కావడంతో.. గొడవలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం వీర్రాజు మద్యం తాగి వీర రాఘవమ్మతో గొడవ పడడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగింది. అనంతరం వీర్రాజు తాగాడు. గమనించిన స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో భార్య వీర రాఘవమ్మ మృతిచెందింది. మెరుగైన చికిత్స కోసం వీర్రాజును కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి ఇద్దరి కూతుళ్లకు వివాహమైంది. మృతురాలి కూతురు మద్దుకూరి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కటిక రవిప్రసాద్ తెలిపారు.