
వినతిపత్రం ఇస్తున్న మహిళా నాయకులు
పెద్దపల్లిరూరల్: పశుమిత్రలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీఐటీయూ నాయకురాలు, పశుమిత్ర వర్కర్స్ జిల్లా గౌరవాధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందించారు. పశుసంతతి వృద్ధికి పనిచేస్తున్న పశుమిత్రలకు పనికితగ్గ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. కృత్రిమ గర్భధారణ శిక్షణ ఇప్పించి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. విధులకు వెళ్లేందుకు వీలుగా ఈ–బైకులను రాయితీపై అందించాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు దశలవారీగా పోరాటాలు సాగిస్తామని పేర్కొన్నారు. నాయకులు రాజేశ్వరి, ప్రియాంక, సరిత, అనూష, సుధ, ఉమాదేవి, స్వప్న, సంధ్య, శ్రీలత, సంతోష పాల్గొన్నారు.