
నియామక పత్రాలు అందజేస్తున్న జీఎం మనోహర్
గోదావరిఖని(రామగుండం): క్రమశిక్షణతో ముందుకు సాగి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆర్జీ–2 జీఎం ఎ.మనోహర్ ఆకాంక్షించారు. సోమవారం జీఎం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 9మంది యువ ఉద్యోగులకు కారుణ్య నియామకాలు అందజేశారు. ఈసందర్భంగా జీఎం మాట్లాడుతూ, ప్రస్తుత సమయంలో చిన్న సంస్థలో ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారిందని, ఈక్రమంలో సింగరేణి సంస్థలో ఉద్యోగం దొరకడం అదృష్టంగా భావించాలన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో రాణించాలని కోరారు. గైర్హాజర్ లేకుండా వృత్తి నైపుణ్యం సాధించాలన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, డీజీఎం పర్సనల్ రాజేంద్రప్రసాద్, ఐఈడీ డీజీఎం మురళీక్రిష్ణ, వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.