డివిజన్ కేంద్రం పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ఫిజీషియన్ కొరత రోగులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇక్కడ ఉండాల్సిన వైద్యుడు ఇన్చార్జిగా వేరే చోట పని చేస్తుండడంతో ఆ విభాగానికి సంబంధించి ఆస్పత్రికి వస్తున్న రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అభివృద్ధి పనుల పేరిట జరుగుతున్న అంతర్గత నిర్మాణాలతో రోగులకు దుమ్ము, ధూళి తప్పడం లేదు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉంది.
ప్రస్తుతం ఆస్పత్రిలో 25 మంది వైద్యులు సేవలు కొనసాగిస్తున్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా సేవలు కొనసాగిస్తున్నాం. మందులు కూడా పూర్తిస్థాయిలో ఉన్నాయి.
– డాక్టర్ కె.చిరంజీవి, సూపరింటెండెంట్,
పాలకొండ ఆస్పత్రి
కురుపాం సామాజిక ఆరోగ్యకేంద్రం


