అనారోగ్యంతో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

అనారోగ్యంతో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి చికిత్స పొందుతూ మహిళ..

వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గల్లా షణ్ముఖరావు (29) అనారోగ్యంతో అస్పత్రి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. ఇందుకు సంబంధించి స్థానికులు కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గల్లా షణ్ముఖరావు 2021 సీఆర్‌పీఎఫ్‌ జీడీ కానిస్టేబుల్‌గా విశాఖపట్నం 198 బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. అనారోగ్యంగా ఉండడంతో మిలట్రీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. దీంతో సీఆర్‌పీఎఫ్‌ సీఐ డి.కృష్ణారావు ఆధ్వర్యంలో సైనికలాంఛనాలతో బొద్దాం శ్మశాన వాటికలో ఆదివారం సాయంత్రం గౌరవవందనం చేస్తూ గాల్లోకి మూడు రౌండ్‌లు కాల్పులు నిర్వహించి అంత్యక్రియలు చేపట్టారు. అనంతరం జాతీయ జెండాను షణ్ముఖరావు తల్లిదండ్రులు వెంకటరమణ ముత్యాలమ్మకు అందజేశారు.

సీతంపేట: మండలంలోని వాబ జంక్షన్‌ వద్ద గురువారం ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో గాయపడిన పాలకొండ మండలం జంపరకోటకు చెందిన వరలక్ష్మి (55) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె భర్త జీలకర్ర మోహన్‌రావు సంఘటన స్థలంలోనే మృతిచెందిన విషయం విదితమే. గాయపడిన వరలక్ష్మి మృతిచెండంతో జంపరకోటలో మరోమారు విషాదఛాయలు అలముకున్నాయి.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

Advertisement
 
Advertisement
Advertisement