రహదారి భద్రతపై ప్రతిజ్ఞ | - | Sakshi
Sakshi News home page

రహదారి భద్రతపై ప్రతిజ్ఞ

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

రహదారి భద్రతపై ప్రతిజ్ఞ

సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీతంపేట మండలంలోని కుశిమి కూడలి వద్ద రహదారి భద్రతపై ఆదివారం పాలకొండ సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు డ్రైవింగ్‌కు ఇవ్వవద్దని సీఐ సూచించారు. రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఓవర్‌ స్పీడ్‌ వెళ్లవద్దని, ఘాట్‌రోడ్‌లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని హితవు పలికారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement