సీతంపేట: గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశాలు పొందిన వారికి ఉచిత భోజన వసతితో కూడిన విద్య అందిస్తారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాల్లో 8 కళాశాలలు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీలతో పాటు ఒకేషనల్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, సీజీఏ గ్రూపులు ఉన్నాయి. వీటిలో 1030 సీట్లు భర్తీ చేస్తారు.
మెరిట్ ఆధారంగానే...
పదో తరగతిలో వచ్చే మెరిట్ మార్కులు ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. ప్రతి గ్రూపుకు 40 సీట్లు కేటాయించారు. దీనిలో ఎస్టీ 36 సీట్లు, ఎస్సీ, బీసీ, ఓసీ, ఏఈక్యూ ఒక్కో సీటు మొత్తం నాలుగు సీట్లు భర్తీచేస్తారు. ఒకేషనల్ ఎఅండ్‌టీ 20, సీజీఏ గ్రూపులో 30 సీట్లు పూర్తిస్థాయిలో ఎస్టీలకు కేటాయించారు.
ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి...
విద్యార్థులు ఆన్‌లైన్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటీడబ్ల్యూఆర్.గవ్.ఇన్‌లో ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
మెరిట్‌జాబితాను ఈ నెల 22న ప్రకటిస్తారు. 26న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
సీతంపేట బాలికల
జూనియర్ కళాశాల
పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం ఐటీడీఏల పరిధిలో 1030 సీట్లు
ఈ నెల 20వరకు దరఖాస్తు గడువు


