రైల్వేగేటు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

రైల్వేగేటు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

సీతానగరం: మండలంలోని విశాఖ – రాయగడ రైల్వేలైన్‌లో జగ్గునాయుడుపేట(ఆర్‌.వెంకంపేట) గేటు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు స్థానికులు శనివారం గుర్తించారు. రైల్వే పోలీసులు అందించిన వివరాలు.. జగ్గునాయుడుపేట ఎల్‌సీ గేటు సమీపంలో గుర్తు తెలియని 45 ఏళ్లు పైబడిన పురుషుడు గుర్తు తెలియని రైలు బండి నుంచి జారిపడి లేదా రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని తెలిపారు. మృతుడు వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొన్నారు. తెలుగు రంగు ఫుల్‌ హ్యాండ్స్‌ షర్ట్‌, నలుపు రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. అతని వద్ద రైల్వే టికెట్‌ లభించిందని అది బ్రహ్మపూర్‌ నుంచి సూరత్‌ టిక్కెట్‌ అని తెలిపారు. వివరాలు తెలిసిన వారు 92475 85742, 94918 13163, 83099 01038 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement