ఆయిల్‌ ట్యాంకర్‌, బస్సు, కారు ఢీ | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ ట్యాంకర్‌, బస్సు, కారు ఢీ

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

ఆయిల్‌ ట్యాంకర్‌, బస్సు, కారు ఢీ

నుజ్జునుజ్జయిన కారు

సాలూరు: పట్టణ సమీపంలో జాతీయరహదారిపై శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. కాసేపటికి ప్రమాదానికి గురైన బస్సును వెనుకనుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనపై ఎస్సై అనిల్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాలూరు నుంచి రామభద్రపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రామభద్రపురం నుంచి సాలూరు వస్తున్న జియో ఆయిల్‌ ట్యాంకర్‌ బలంగా ఢీకొట్టింది.ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైన బస్సును వెనుకనుంచి వచ్చి ఓ కారు ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్‌, లారీ క్లీనర్‌కు గాయాలవగా, స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లియర్‌ చేశారు.దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement