పార్వతీపురం రూరల్: మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలు, రిటైర్డ్ సిబ్బందికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది కుటుంబాల సమస్యలు, పెండింగ్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ ప్రయోజనాలపై వివరాలు తెలుసుకుని, అవి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని డీపీఓ అధికారులను ఆదేశించారు. మరణించిన సిబ్బంది కుటుంబాలకు ఎల్ల ప్పుడు అండగా ఉంటామని, రిటైర్డ్ సిబ్బంది సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్‌ఐ నాయుడు, డీపీఓ ముంతాజ్ బేగం, ఏఏఓ శంకరరావు పాల్గొన్నారు.


