ఏనుగులతో భీతిల్లుతున్న ప్రజలు | - | Sakshi
Sakshi News home page

ఏనుగులతో భీతిల్లుతున్న ప్రజలు

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో ప్రజలు భీతిల్లుతున్నారు. గరుగుబిల్లి మండలంలోని సుంకి, సంతోషపురం గ్రామాల మీదుగా నందివానివలస గ్రామానికి ఏనుగులు శుక్రవారం చేరుకున్నాయి. వారం రోజులనుంచి మండలంలోని పలుగ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నందివానివలస, తోటపల్లి, ఖడ్గవలస, నాగూరు తదితర గ్రామాల్లో సంచరించి పలు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రస్తుతం పొలంలో అరటి, పామాయిల్‌, వేరుశనగ తదితర పంటలు ఉండడంతో ఎప్పుడు ఏ పంటలకు నష్టం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పంధించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement