పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చూపారు. అధికమంది ఉత్తమ మార్కులు సాధించారు. దీనికి ‘సాక్షి’ యాజమాన్యం అందించిన పదోతరగతి మెటీరియల్ దోహదపడిందని విద్యార్థులు చెబుతున్నారు. సరళంగా, వివరణాత్మకంగా, సులభంగా అర్థంచేసుకునేందుకు వీలుగా విద్యానిపుణులతో తయారుచేసిన మెటీరియల్ ఉత్తమ మార్కుల సాధనకు ఉపయోగపడిందని పేర్కొన్నారు. మంచి మెటీరియల్ అందించి విజయంలో భాగస్వామ్యమైన ‘సాక్షి’కి కృతజ్ఞతలు చెబుతున్నారు.
– జియ్యమ్మవలస రూరల్/సీతానగరం


