పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 595 మార్కుల సాధనకు ‘సాక్షి స్టడీ’ మెటీరియల్ సహాయపడింది. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో సందేహాల నివృత్తికి మెటీరియల్ దోహదపడింది. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు సాధించగలిగాను.
– ఆర్.నిత్యకనక వర్షిణి, సీతానగరం
సాక్షి యాజమాన్యం గణితం, సైన్స్ సబ్జెక్టుల స్టడీమెటీరియల్‌ను చదివాను. పదోతరగతిలో 585 మార్కులు సాధించాను. అధిక మార్కుల సాధనకు ఉపా ధ్యాయుల బోధనతో పాటు మెటీరియల్ దోహదపడింది. – బి.సాయికృష్ణ, రాచకిండాం హైస్కూల్
పబ్లిక్ పరీక్షల ముందు సాక్షి యాజమాన్యం స్టడీ మెటీరియల్ అందించింది. ఈ పుస్తకాల్లో కంటెంట్ కనిపించింది. ప్రాక్టీస్ చేశాను. పదో తరగతి ఫలితాల్లో 594 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాను. – గొర్లె సాద్విక, చిన్నయ్యపేట,
మందరాడ జెడ్పీ హైస్కూల్, సంతకవిటి మండలం


