పదిలంగా నిలిచారు! | - | Sakshi
Sakshi News home page

పదిలంగా నిలిచారు!

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

సీతంపేట ఐటీడీఏలో టెన్త్‌ రిజల్ట్స్‌ అదుర్స్‌

20 గిరిజన విద్యా సంస్థల్లో శతశాతం విద్యార్థుల పాస్‌

94 శాతం ఉత్తీర్ణత

సతంపేట: సీతంపేట ఐటీడీఏ పరిధిలో వివిధ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పదో తరగతి ఫలితాల్లో గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు అదరగొట్టారు. మొత్తం 49 విద్యా సంస్థలకుగాను 20 పాఠశాలల్లో శతశాతం ఫలితాలు సాధించారు. 1785 మంది విద్యార్థులకుగాను 1692 మంది పాసయ్యారు. దీనిలో ఆశ్రమ పాఠశాలల నుంచి 1476 మంది హాజరు కాగా 1390 మంది ఉత్తీర్ణత సాధించారు. గిరిజన గురుకులాల నుంచి 309 మంది హాజరు కాగా 302 మంది పాసయ్యారు. మొత్తం 94.79 శాతం ఉత్తీర్ణత సాధించారు. చిన్నకోస్తాకు చెందిన బి.జాస్మిన్‌ 590 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. పూతికవలస గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన వూయక సుస్మిత 583 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచింది. సామరెల్లి బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన బిడ్డిక జయశ్రీ 581 మార్కులు సాధించింది. బాలికల పాఠశాలల్లో బుడంబో, బరణికోట, బొమ్మిక, సవర బొంతు, బడ్డుమాసింగి, సామరెల్లి, సీతంపేట, ముత్యాలు, హడ్డుబంగి, పూతికవలస, సీతంపేట ఏపీఆర్‌ గర్‌ల్స్‌, పాఠశాలలు శతశాతం ఫలితాలు సాధించాయి. బాలుర ఆశ్రమ పాఠశాలల్లో ఎస్‌ఎస్‌ మణుగు, చిన్నబగ్గ, దోనుబాయి, మల్లి, పెద్దపొల్ల, శంబాం, గంగంపేట, మల్లి పీటీజీ గురుకుల బాలుర పాఠశాల, సీతంపేట గురుకుల బాలుర పాఠశాలలు శతశాతం ఫలితాలు సాధించారు.

బి.జయశ్రీ(581) సామరెల్లి ఆశ్రమ పాఠశాల

బి.జాస్మిన్‌ (590), చిన్నకోస్తా,

ఆశ్రమ పాఠశాల

వి.సుశ్మిత (583), పూతికవలస ఆశ్రమ పాఠశాల

Advertisement
 
Advertisement
Advertisement