● ముఖ్య నాయకుడి ఇంటి నిర్మాణం కోసం అక్రమంగా తరలింపు
సాక్షి, పార్వతీపురం మన్యం : పార్వతీపురం మండలం అడారు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో సుమారు 20 టేకు చెట్లు మాయమయ్యాయి. రాత్రికి రాత్రే వీటిని కొట్టి, తరలించినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఓ ముఖ్య నాయకుడి ఇంటి నిర్మాణం కోసం అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నాయకులు దగ్గరుండి, గుట్టుగా వీటిని తొలగించి, తరలించుకుపోయినట్టు సమాచారం. ఏళ్ల క్రితం నాటి ఈ చెట్ల కలప విలువ రూ.లక్షల్లో ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండానే, విశాలమైన చెట్లను తొలగించి తీసుకెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


