ఈ ప్రమాదంలో గాయపడిన ఎనిమిదేళ్ల రుషికుమార్, ఆరేళ్ల హేమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి తల్లి కొండగొర్రి శ్రావణి సంఘటన స్థలంలోనే మరణించింది. తల్లి మృతి చెందిందన్న విషయం తెలియని ఆ చిన్నారులిద్దరూ అమ్మ ఎక్కడంటూ రోదిస్తుంటే అక్కడి వారి హృదయాలు చలించిపోయాయి. బంధువులు సమాధానం చెప్పలేక... చిన్నారులను సముదాయించలేక కన్నీరుమున్నీరవుతున్నారు. మా అమ్మ ఎక్కడంటూ అభంశుభం తెలియని ఆ చిన్నారుల రోదనలు అరణ్యరోదనలే అవుతున్నాయి.
తల్లిని కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న
చిన్నారులు హేమ, రుషికుమార్


