రాష్ట్రస్థాయి టీచర్ల క్రికెట్‌లో.. ‘మన్యం పాంథర్స్’కు
పార్వతీపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ నెల 8 నుంచి 10 వరకు జరిగిన ఈ టోర్నీలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో పార్వతీపురం పాంథర్స్ జట్టు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానాన్ని దక్కించుకుంది. విజేతలుగా నిలిచిన జట్టు సభ్యులను, కెప్టెన్ నవీన్, కోచ్‌ను జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) బ్రహ్మాజీ, ఎస్జీఎఫ్ కార్యదర్శి సబ్బాన మురళి ఐక్య ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఒక కార్యక్రమంలో అభినందించారు.


