ఇట్లామామిడిపల్లిలో డయేరియా
రామభద్రపురం/బాడంగి: మండలంలోని ఇట్లామామిడిపల్లి గ్రామంలో అతిసార వ్యాధి విజృంభించింది. గ్రామానికి చెందిన రాయిపల్లి అచ్చియ్యమ్మ, లెంక అప్పలనరసమ్మ, గొర్లి మంగ, గంట అప్పలనరసమ్మలకు డయేరియా సోకి వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో జీవనరాణి, ఆరికతోట పీహెచ్‌సీ వైద్యాధికారిణి అపర్ణ ఇట్లామామిడిపల్లి గ్రామానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి 108 అంబులెన్స్‌లో తరలించారు. డీఎంహెచ్‌వో బాడంగి సీహెచ్‌సీకి కూడా వెళ్లి నలుగురు డయేరియా బాధితులను పరామర్శించారు. అయితే నిన్న ముచ్చర్లవలసలో 15 మంది డయేరియా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత కోలుకుని శుక్రవారం ఇంటికి చేరుకున్నారు. అది మరువక ముందే ఇట్లామామిడిపల్లిలో పలువురికి డయేరియా సోకడంతో రామభద్రపురం మండలంలోనే ఇలా ఎందుకు జరుగుతోందని మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఉపాధి పనుల సామాజిక తనిఖీ
సీతానగరం: స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఉపాధిహామీ పనుల నిర్వహణపై మండల స్థాయి సామాజిక తనిఖీ డ్వామా పీడీ కె రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగింది. 2024 మార్చి31వ తేదీనుంచి 2025 ఏప్రిల్1 వరకూ గ్రామాల్లో ఉపాధిహామీ పనులతో జరిగిన రోడ్ల పనులు ఉపాధి హామీ పనులకు సామాజిక తనిఖీ బృందం 2025 సెప్టెంబరులో గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. గ్రామసభల్లో ప్రజలనుంచి వచ్చి అభియోగాల మేరకు ప్రజావేదికలో చదివి వినిపించారు. రూ.31 కోట్లతో 117 పనులకు గాను నిధులు ఖర్చయినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బాబ్జీ, ఎంపీపీ బి రమణమ్మ వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బి.శ్రీరాములునాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు పి సత్యం, పలుగ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పెళ్లి పేరుతో మోసగించిన వ్యక్తిపై ఫిర్యాదు
సీతంపేట: వివాహం చేసుకుంటానని చెప్పి మోసగించిన వ్యక్తిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పాలకొండకు చెందిన సచివాలయ ఉద్యోగి సాగర్ తనను మోసం చేశాడని అక్కడే పనిచేస్తున్న కొత్తూరుకు చెందిన సహచర మహిళా ఉద్యోగిని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. ఈ మేరకు పాలకొండ సీఐ ప్రసాదరావు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
సఖి సురక్ష హెల్త్ స్క్రీనింగ్ ప్రారంభం
సాలూరు: పట్టణంలోని దాసరివీధిలో గల సీతారామకల్యాణ మంటపంలో శుక్రవారం నిర్వహించిన సఖి సురక్ష హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని సీ్త్రశిశుసంక్షేమ,గిరిజన సంక్షేమశాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యపరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటూ కార్యక్రమం ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
రెండు బైక్‌లు ఢీ: వ్యక్తికి గాయాలు
వేపాడ: మండలంలోని వల్లంపూడి గ్రామసమీపంలో శానాపతి వారి కళ్లాల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు,. గ్రామానికి చెందిన శానాపతి రమణ శుక్రవారం కళ్లానికి వెళ్తుండగా సోంపురం వైపు వెళ్తున్న బైక్, వేపాడ వైపు వస్తున్న బైక్ కళ్లాలవద్ద నడుచుకుంటూ వెళ్తున్న శానాపతి రమణను ఢీకొనడంతో తలకు గాయమైంది. దీంతో వెంటనే బాధితుడిని 108లో ఎస్.కోట తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించినట్లు బాధితుడి కుటుంబసభ్యులు తెలిపారు.
ఇట్లామామిడిపల్లిలో డయేరియా
ఇట్లామామిడిపల్లిలో డయేరియా


