పోరుబాట | - | Sakshi
Sakshi News home page

పోరుబాట

Oct 13 2025 8:18 AM | Updated on Oct 13 2025 8:18 AM

పోరుబ

పోరుబాట

కూటమి అరాచక పాలనపై పోరుబాట కోటి సంతకాల సేకరణ

న్యూస్‌రీల్‌

టీడీపీ నేతల కనుసన్నల్లోనే కల్తీ మద్యం తయారీ నేడు కల్తీ మద్యానికి వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాలలో నిరసనలు ఆడబిడ్డల తాళిబొట్లు తెంచవద్దంటూ ఎకై ్సజ్‌ అధికారులకు వినతులు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా అవగాహన ర్యాలీలు ఆరోగ్యశ్రీ సేవలను తక్షణమే పునరుద్ధరించాలి ఏ అధికారంతో ఉత్సవాల పేరిట చందాలు వసూలు చేశారు..? జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు

నేడు కల్తీ మద్యానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు

సోమవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025
కూటమి అరాచక పాలనపై

విజయనగరం:

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై, దురాగతాలపై పోరాటం చేయనున్నట్టు విజయగనరం జిల్లా పరిషత్‌ ౖచైర్మన్‌, వైఎస్సా ర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీ య అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చేపడుతున్న పోరాటాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్‌ ప్యాలెస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మజ్జి శ్రీనివాసరావు పోరాట కార్యాచరణ ప్రకటించారు.

పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య అందించాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటాన్ని ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ తీవ్ర ంగా వ్యతిరేకిస్తోందని శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో ప్రజల నుంచి కోటి సంతకాలు సేకరించి గవర్నర్‌కు అందజేయటం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించిన అనంతరం, 12న జిల్లా కేంద్రంలో ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.

అంబేడ్కర్‌ ఆశయాలను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ప్రభుత్వాలే విద్య, వైద్యం అందించాలని ఆకాంక్షిస్తే ప్రస్తుత కూటమి సర్కారు ప్రైవేటీకరణ చేయటం తగదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్‌ కళాశాలలను నిర్మించాలని జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించగా, అందులో 7 కాలేజీలను పూర్తి చేయ గా... 5 కాలేజీల్లో తరగతులు జరుగుతున్నాయన్నా రు. మిగిలిన కాలేజీల నిర్మాణానికి రూ.5000 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవుతాయని చెప్పారు. 16 నెలల కాలంలో రూ.2లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి డబ్బులు లేవని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు లేకపోవటంతోనే కురుపాంలో పచ్చకామెర్ల బారిన పడిన విద్యార్థులను 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖలో ని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. విజయనగరంలో ప్రైవేటుగా నిర్వహిస్తున్న మిమ్స్‌ ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించారు. మెడికల్‌ కాలేజీల విషయంలో పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకునేంత వరకు ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు.

ఏ అధికారంతో చందాలు వసూలు చేశారు..?

విజయనగరం ఉత్సవాల పేరిట జిల్లా అధికార యంత్రాంగం ఏ అధికారంతో చందాలు వసూలు చేశారో చెప్పాలని మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించా రు. విజయనగరం ఉత్సవం అనేది ప్రభుత్వంతో సంబంధం లేదని, అటువంటి కార్యక్రమానికి ప్రత్యేకంగా అకౌంట్‌లు పెట్టి బలవంతపు వసూళ్లు చేయటాన్ని తప్పుపడుతున్నామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు నిధులు సేకరించి ఉత్సవాలు నిర్వహించే వారని ఈ ఏడాది అందుకు భిన్నంగా అధికార యంత్రాంగంతో చందాలు వసూలు చేయించటం దారుణమన్నారు. ఉత్సవాల పేరిట ఎంత మొత్తంలో చందాలు వసూలు చేశారు..? ఎంత ఖర్చు చేశారన్న లెక్కలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్రి నర్సింహమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు కెవి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబా బు, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో టీడీపీ నేతల కనుసన్నల్లోనే కల్తీ మద్యం తయారు చేసి నేరుగా షాపుల్లో విక్రయించటం దారుణమని మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ మద్యం మాఫియాకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 13న సోమవారం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు పార్టీ సమన్వయకర్తలు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం కల్తీ మద్యం తయారీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎకై ్సజ్‌ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. కల్తీ మద్యం తయారీని ఓ కుటీర పరిశ్రమలా ఏర్పాటు చేసినట్టు వెలుగులోకి రావటం, వాటిని టీడీపీ నేతల అనుచరులే నిర్వహిస్తున్నట్టు తేటతెల్లమైందన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఇటువంటి ఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదని ప్రభుత్వ ఆధ్వర్యంలో పారదర్శకంగా విక్రయాలు జరిగాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేటు వ్యాపారులకు అప్పగించి కల్తీ మద్యం మాఫియాను ప్రోత్సహించిందని ఆరోపించారు. ఇప్పటి వరకు కల్తీ మద్యం తాగి రాష్ట్రంలో 35 మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. కృష్ణ, ఏలూరు, పరవాడ తదితర ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారీ చేసి విక్రయించడంపై ప్రభుత్వం, ఎౖక్సైజ్‌ అధికారులు నిర్లక్ష్యం నటిస్తున్నారని మండిపడ్డారు. ఫలితంగా ఆడబిడ్డల తాళిబొట్లు తెంచిన పాపానికి ఒడిగడుతున్నారని దుయ్యబట్టారు. అంతేకాకుండా వేలాది మంది కిడ్నీ, లివర్‌లు పాడై అనారోగ్యాల బారిన పడుతున్నారని.. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తక్షణమే కల్తీ మద్యం తయారీని పూర్తి స్థాయిలో కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

పోరుబాట 1
1/3

పోరుబాట

పోరుబాట 2
2/3

పోరుబాట

పోరుబాట 3
3/3

పోరుబాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement