
ఆందోళన.. ఆవేదన
●పాఠశాల ఏర్పాటు చేస్తారా?
ఒడిశాకు పంపిస్తారా?
కొమరాడ మండలం పూడేసు పంచాయతీ గుమడింగి గ్రామంలో పాఠశాల లేక పిల్లలు చదువుకు దూరమవుతున్నారని గ్రామస్తులు వాపోయారు. సుమారు 45 కుటుంబాలు జీవిస్తున్నామని, 20 మంది వరకు బడిఈడు పిల్లలున్నారని తెలిపారు.
అధికారులను అడిగితే 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎండభద్ర పాఠశాలకు వెళ్లాలంటున్నారని.. దానికి బదులు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఒడిశాలో తమను విలీనం చేస్తే వెళ్లిపోతామని గ్రామానికి చెందిన ఆరిక నాగేశ్వరరావు తదితరులు వాపోయారు. కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.
పార్వతీపురం రూరల్: పార్వతీపురంలోని కలెక్టరేట్ వద్ద వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలపై ఆందోళనలు చేశారు. తమకు జరిగిన అన్యాయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు వినతులు అందజేశారు.
●మంత్రి గారూ.. వినిపిస్తోందా...
గత ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గెలుపుకోసం ఎంతో కష్టపడ్డాం. నాకు ఏ ఆధారమూ లేదు. వితంతువును. ఆశ కార్యకర్త పోస్టు ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడు నాకు కాదని ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి భార్యకు అప్పగించారు. మంత్రి సంధ్యారాణిని అడిగితే.. ‘ఆ పోస్టు నీకు ఇవ్వలేం. మా బంధువు లకు ఇవ్వాలి’ అంటూ దాటవేశారు.’ అంటూ సా లూరు మండలం తోణాం పంచాయతీకి చెందిన సుజాత అనే మహిళ వాపోయారు. అధికారులను కలిసి వేడుకుంటున్నా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీఆర్‌ఎస్‌లో ఉన్నతాధికారులను మరోమారు వినతిపత్రం అందజేశా రు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
●ఆ కంపు భరించలేం..
పార్వతీపురం మండలంలోని డోకిశీల పంచాయతీ చలంవలసలో నివాసాలకు కేవలం 50 మీటర్ల దూరంలో కోళ్ల ఫారాన్ని పెట్టారు. విపరీతమైన దుర్వాసన వస్తోంది... ఆ కంపును భరించలేం.. తక్షణమే కోళ్ల ఫారాన్ని తీసేయాలంటూ చలంవలస గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేశారు. అధికారులకు తమ గోడు వినిపించారు.

ఆందోళన.. ఆవేదన

ఆందోళన.. ఆవేదన