
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ130 శ్రీ230 శ్రీ240
ఇద్దరు కానిస్టేబుల్స్ ఏఆర్‌కు అటాచ్..!
కొత్తవలస: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న జి.రమేష్, డి.దేముడులను ఏఆర్‌కు అటాచ్ చేస్తూ ఎస్పీ వకుల్ జిందల్ ఈ నెల 17న ఉత్తర్వులు జారీ చేశారు. వారిపై వివిధ రకాల ఆరోపణలు రావడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏఆర్‌కు అటాచ్ చేసినట్లు సమాచారం. కాగా ఈ విషయమై స్థానిక సీఐ షణ్ముఖరావును వివరణ కోరగా ఇంకా ఎటువంటి ఆర్డర్స్ అందలేదని, డిపార్ట్‌మెంట్‌లో ఇలాంటి విషయాలు సహజమని చెప్పారు.
వడదెబ్బతోగొర్రెల కాపరి మృతి
మక్కువ: మండలంలోని కోన గ్రామానికి చెందిన పోలయ్య (42) మంగళవారం వడదెబ్బతోమృతిచెందినట్లు కుబుంబసభ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పోలయ్య మంగళవారం కోన గ్రామం పక్కనే ఉన్న దబ్బగెడ్డ గ్రామం సమీపంలో గొర్రెలను మేతకోసం తీసుకుని వెళ్లాడు. సాయంత్రం గొర్రెలు ఇంటికి వచ్చినప్పటికీ పోలయ్య రాకపోవడంతో, కుటంబసభ్యులు వెతకగా పొలాల్లో విగతజీవిగా పడి ఉన్నాడు. వడదెబ్బకు తాళలేక మృతిచెందినట్లు భార్య పార్వతి కన్నీరుమున్నీరైంది. పోలయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోన పంచాయతీ వీఆర్‌ఓ ఈ సమాచారాన్ని తహసీల్దార్ షేక్ ఇబ్రహీంకు అందించారు. ఈ విషయంపై కలెక్టర్‌కు రిపోర్ట్ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు.
భార్యను గాయపరిచిన భర్త
పార్వతీపురం రూరల్: కుటుంబ కలహాల కారణంగా భార్యను భర్త గాయపరిచాడు. పార్వతీపురం పట్టణంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ కె. మురళీధర్ మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కొత్తవీధికి చెందిన భార్యభర్తల మధ్య కుటుంబ కలహాల కారణంగా వివాదం తలెత్తడంతో భర్త క్షణికావేశంతో భార్య వీపుపై సమీపంలో ఉన్న దబ్బనంతో పొడిచి గాయపరిచాడని ఈ మేరకు భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గాయపడిన భార్య ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు.
10 లీటర్ల సారాతో
ముగ్గురి ఆరెస్టు
కొత్తవలస: మండలంలోని అప్పన్నదొరపాలెం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఎకై ్సజ్ దాడుల్లో 10 లీటర్ల సారాతో ముగ్గురు వ్యక్తులు పట్టుబడడంతో వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్.రమశ్రీ తెలిపారు. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో సారా విక్రయాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో భీశెట్టి నాగమణి, జోడు పైడితల్లమ్మ, కె.సూర్యనారాయణలు 10 లీటర్ల సారాతో పట్టుబడినట్లు ఆమె తెలిపారు. వారి దగ్గర గల సారాను స్వాధీనం చేసుకుని వారిని ఆరెస్టు చేసి కొత్తవలస న్యాయస్థానంలో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై చెప్పారు.
కారులో తరలిస్తున్న సారా పట్టివేత
వీరఘట్టం: కొందరు వ్యక్తులు కారులో గుట్టుగా తరలిస్తున్న సుమారు 160 లీటర్ల సారాను మంగళవారం తెల్లవారుజామున వీరఘట్టం కొత్త బస్టాండ్‌లో ఎకై ్సజ్‌శాఖ అధికారులు పట్టుకున్నారు. వీరఘట్టానికి చెందిన ఓ వ్యక్తి కారును కొందరు వ్యక్తులు అద్దెకు తీసుకుని, ఆ కారులో సారా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో కొత్త బస్టాండ్ వద్ద మాటువేసిన ఎకై ్సజ్‌శాఖ అధికారులు మంగళవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఆ కారును ఆపి సోదాలు చేయగా 160 లీటర్ల సారా పట్టుబడింది.అయితే కారులో ఉన్నవారు పరారైనట్లు సమాచారం. ఈ విషయంపై పాలకొండ ఎకై ్సజ్ సీఐ సూర్యకుమారిని వివరణ కోరగా..కారులో 160 లీటర్ల సారా పట్టుకున్నట్లు తెలిపారు.దీని వెనుక ఎవరెవరున్నారో దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తామన్నారు.

చికెన్

చికెన్