
సెన్సార్లు, ఏఐ ద్వారా మానవ కార్యకలాపాల గుర్తింపు
● లెండిలో సిల్‌చూర్ నిట్ నిపుణుడు డాక్టర్ బాదల్ సోని
డెంకాడ: అల్గారిథమ్‌ను ఉపయోగించి మానవ కార్యకలాపాల గుర్తింపు‘ అనే అంశంపై లెండి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో మంగళవారం ఒక రోజు సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా అసోం లోని సిల్‌చూర్‌లో గల నిట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాదల్ సోని హాజరై కార్యక్రమంపై ప్రసంగించారు. ‘సెన్సార్ డేటా, స్మార్ట్ లెర్నింగ్ అధునాతన సెన్సార్ టెక్నాలజీలు, మెషిన్ లెర్నింగ్ విధానాల ద్వారా కార్యాచరణ గుర్తింపుపై దృష్టి సారించాలని సూచించారు. స్మార్ట్ లెర్నింగ్ అల్గారిథమ్‌తో సెన్సార్ డేటాను సమగ్రపరచడం పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ఇంటర్ డిసిప్లినరీ రంగం ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్ హోమ్‌లు, భద్రత, మానవ–కంప్యూటర్ పరస్పర చర్య, మానవ ప్రతిచర్యలపై ఏఐ, నిజంగా తెలివైన వాతావరణాన్ని సృష్టించడానికి వీలు కల్పించడం వంటి కీలక రంగాల్లో ఎలా విప్లవాత్మక మార్పులు తెస్తోందో ఆయన వివరించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఇటువంటి ఈవెంట్‌ను నిర్వహించడంలో ఇనిన్‌స్టిట్యూట్ ప్రయత్నాలను ప్రశంసిస్తూ, విద్యార్థులు, పరిశోధకులు ఈ ఆశాజనకమైన టెక్నాలజీ రంగాన్ని అన్వేషించడం, ఆవిష్కరణలు చేయడం ద్వారా చురుగ్గా సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీ రామారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ అకడమిక్స్ డాక్టర్ వి.అంజి రెడ్డి, డీన్‌న్‌లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.