
రూ. 4,215.30 కోట్లతో పీఎల్ క్రెడిట్ ప్లాన్
పార్వతీపురం టౌన్ : జిల్లాలో రూ.4,215.30 కోట్లతో ప్రొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2025–26 ను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ విడుదల చేశారు. నాబార్డు రూపొందించిన క్రెడిట్ ప్లాన్‌ను కలెక్టరేట్ లో సోమవారం జరిగిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశంలో విడుదల చేశారు. ప్రాధాన్యతా రంగాలకు రుణాలు పెంచడం, మౌలి క సదుపాయాల అంతరాలను తగ్గించడం, స్థిరమై న– సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు ఈ ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చామన్నారు. మొత్తం రుణసామర్థ్యం రూ. 4,215.30 కో ట్లు కాగా, ఇందులో మౌలిక సదుపాయాలు, అనుబంధ రంగాలకు రూ.3,316.04 కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.386.69 కోట్లు, గృహ నిర్మాణానికి రూ. 221.40 కోట్లు, విద్యకు రూ. 21.68 కోట్లు, ఎగుమ తి క్రెడిట్ రూ.5.10 కోట్లు, పునరుత్పాదక ఇంధనానికి రూ.25.24 కోట్లు, సామాజిక మౌలిక సదుపా యాలకు రూ.107.24 కోట్లు, ఇతర రంగాలకు రూ. 131.90 కోట్లు కేటాయించామన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, జిల్లా పరిశ్రమల అధికారి కరుణాకర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయస్వరూప్, తదితరులు పాల్గొన్నారు.