
నాలుగోరోజుకు చేరిన రిలేనిరాహార దీక్ష
పార్వతీపురం: ఐటీడీఏ ద్వారా ఏజెన్సీ ప్రాంతాలలోని ఉపాధ్యాయ పోస్టులను ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి ఆదివాసీలతోనే నియామాకాలను చేపట్టాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా ఆదివాసీ సంఘాల ఐక్యకార్యచరణ సమితి (ఏజేఏసీ) ఆధ్వర్యంలో యువత రిలే నిరాహార దీక్షను చేపట్టారు. సోమవారం ఏపీ ఆదివాసీ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఐటీడీఏ ఆవరణలో ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాలుగో రోజు ప్లకార్డులతో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. రిలే నిరాహర దీక్షలో కె.ధర్మారావు, ఆరిక నీలకంఠం, డి.సీతారాం, రామకృష్ణ, చంద్రశేఖర్, మల్లయ్య, గిరిధర్, సాయిబాబు, ఆదివాసీ టీచర్స్ అసోషియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు టి.సత్యనారాయణ, వై.సూర్యనారాయణ, డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్ధులు పాల్గొన్నారు.