
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ130 శ్రీ230 శ్రీ240
పింఛన్ పెంచండి సారూ
● కలెక్టర్‌కు వేడుకోలు
పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వంలో పింఛన్ దారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సోమవారం వస్తేచాలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు కలెక్టర్ కార్యాలయానికి నడవలేని పరిస్థితుల్లో కుటుంబసభ్యుల సహాయంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కొంతమందికి అర్హత ఉన్నా పింఛన్ రావడం లేదని, మరికొంతమందికి 90శాతం దాటి వైకల్యం ఉన్నా కేవలం రూ.6వేలే పింఛన్ ఇస్తున్నారని, తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేస్తున్నారు.
స్టేట్‌లెవెల్ కరాటే చాంపియన్‌షిప్‌కు రాజాం విద్యార్థులు
రాజాం సిటీ: త్వరలో జరగనున్న స్టేట్‌లెవెల్ కరాటే చాంపియన్‌షిప్ పోటీలకు రాజాంలోని శివసైన్యం కరాటే విద్యార్థులు ఎంపికయ్యారని కోచ్ ఆర్.శివ సోమవారం తెలిపారు. ఈ నెల 18న విజయనగరంలోని రాజీవ్ ఇండోర్‌స్టేడియంలో జరిగిన పోటీల్లో కుమిటీ విభాగంలో వి.రిషిక (ప్రథమస్థానం), కాటా విభాగంలో వి.మోహిత్ (ద్వితీయ స్థానం), కె.మహేష్ (మూడో స్థానం)లో నిలిచి ఈ ఘనత సాధించారన్నారు. విద్యార్థుల ప్రతిభను పట్టణానికి చెందిన పలువురు అభినందించారు.
ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని శివరాం గ్రామానికి చెందిన కుమిలి భాస్కరరావు(27)అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు భాస్కరరావు గ్రామంలో డబ్బులు అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు అడగడంతో మనస్తాపం చెంది సోమవారం ఉదయం ఇంటిలో ఇనుపరాడ్డుకు బెడ్‌షీట్‌ను కట్టి ఉరివేసుకున్నాడు. ఈ మేరకు గరివిడి ఎస్సై బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోవులపై వికృత చేష్టలకు
పాల్పడిన వ్యక్తి అరెస్టు
పూసపాటిరేగ: మండలంలోని కుమిలి గ్రామంలో గోవులపై వికృత చేష్టలకు పాల్పడి, గో హత్య చేసిన వ్యకిని పూసపాటిరేగ పోలీసులు ఎట్టకేలకు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..కొమరాడ మండలంలోని పెళ్లిగుడ్డి కంపవలసకు చెందిన నల్లిమిల్లి చంటి (45) ఉరఫ్ మల్లేష్ గోవులపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మల్లేష్ కుమిలి సమీపంలో క్వారీలో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తూ కుమిలిలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే రైతు ఆవుకు తాడుతో ఉరిపెట్టి వికృత చేష్టలకు పాల్పడుతుండగా ఆవు అరవడంతో గ్రామస్తులు వచ్చి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గత నెలలో కుమిలి గ్రామంలో ఆవు రొమ్మలు, మర్మాంగాలు కోయడంతో ఆవు మృతి చెందిన విషయం విదితమే. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తి మల్లేష్ అని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. మూగజీవాలపై కిరాతకంగా వ్యవహరిస్తున్న మల్లేష్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు
శృంగవరపుకోట: మండలంలోని వెంకటరమణపేట గ్రామానికి చెందిన వివాహిత ఎర్రాప్రగడ వెంకటలక్ష్మి (38) హత్యకేసును ఎస్.కోట పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి సీఐ నారాయణమూర్తి సోమవారం రాత్రి అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి హత్యలో మృతురాలి కుమారై రుచిత ప్రమేయం ఉన్నట్లు చెప్పారు. ప్రణాళిక ప్రకారం తన తల్లిని ఇద్దరు స్నేహితులతో హత్య చేయించి గ్రామ సమీపంలోని నూతిలో తోయించినట్లు చెప్పారు. పూర్తి దర్యాప్తు నిమిత్తం కుమార్తె రుచితను అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితురాలిని జువైనల్ హోమ్‌కు తరలించామన్నారు. మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. వెంకటలక్ష్మి మృతిపై కుమారుడు హరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు.

చికెన్

చికెన్