
ముగిసిన శివాలయం ప్రతిష్ట
సీతానగరం: మండలంలోని కృష్ణారాయపురం గ్రా మస్తులు, మరికొంతమంది దాతల ఆర్ధిక సహా యంతో నిర్మాణం జరిగిన శివాలయం ప్రతిష్టాపన మహోత్సవాలు సోమవారం ముగిశాయి. అసంఖ్యాక దేవాలయాల ప్రతిష్టాపకుడు, వేదపండితుడు ఎస్‌వీఎల్‌ఎన్ శర్మయాజీ ఆధ్వర్యంలో 12 మంది అర్చకులతో ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని కంకణధారులు పూజా సామగ్రితో ఉదయం 5 గంటలనుంచి పూజలు ప్రారంభించారు. అనంతరం భక్తులంతా కొబ్బరి నీటితో దేవతామూర్తులకు అభిషేకాలు చేశారు. అభిషేకం చేసిన దేవతామూర్తులను సాయంత్రం 5 గంటలనుంచి రాత్రి 7 గంటల వరకూ తిరువీధి నిర్వహించారు. 8 గంటలకు జలాభిషేకం, 9 గంటలకు ఉపనిషత్ పారాయణం జరిగాయి. ఈ సందర్భంగా వేదపండితుడు ఎస్‌వీఎల్‌ఎన్ శర్మయాజీ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలోనే కృష్ణారాయపురం శివాలయం ప్రశస్థమైనదన్నారు. శివాలయంలో మరకత శివలింగం ప్రతిష్టించామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నవగ్రహ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించినట్లు చెప్పారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకున్న వారు సిరిసంపదలతో తులతూగుతారని, చేసిన పాపాలు హరిస్తాయన్నారు. స్థలదాతలు పోల లక్ష్మునాయుడు, బోడెమ్మల జ్ఞాపకార్ధం వారి కుటుంబసబ్యులు, బడేశ్రీరాములు దంపతులు మహాపంచముఖేశ్వ మరకత శివలింగం ఆలయానికి సమర్పించినట్లు తెలియజేశారు.

ముగిసిన శివాలయం ప్రతిష్ట