
ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలి
పార్వతీపురంటౌన్: మెగా డీఎస్సీ నుంచి గిరిజన ప్రాంత పోస్టులు మినహాయింపు చేసి ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని ఆదివాసీ జేఏసీ చైర్మన్ కొండగొర్రి ధర్మారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సలహామండలి(టీఏసీ) తక్షణమే ఏర్పాటు చేసి రద్దయిన జీఓ నంబర్ మూడు స్థానంలో కొత్త చట్టం తీసుకువచ్చి గిరిజన ప్రాంత ఉద్యోగాలు గిరిజనులకు వచ్చే విధమైన చట్టం తీసుకువస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని కోరారు.
విలీనం ఆలోచన విరమించుకోవాలి
● గిరివెలుగు డీఆర్‌డీఏలోకి విలీనం సరికాదు
పార్వతీపురం: గిరిజనులకు సేవలందించేందుకు ఐటీడీఏను ఏర్పాటు చేసి శాఖలుగా విభజించి సేవలు అందించే క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఐటీడీఏను కనుమరుగు చేసే విధంగా వ్యవహరిస్తోందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కె.సాంబమూర్తి పేర్కొన్నారు. ఇప్పటికే గ్రీవెన్స్‌సెల్‌ను కలెక్టర్ కార్యాలయానికి తరలించి గిరిజనులు ప్రత్యేకంగా తమ గోడును విన్నవించుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని ఇదే వైఖరితో మళ్లీ ఐటీడీఏకి అనుసంధానంగా ఉండే గిరివెలుగును డీఆర్‌డీఏలో కలిపి అనుసంధానం చేసే ఆలోచన గిరిజనులకు అన్యాయం చేసేలా విడ్డూరంగా ఉందన్నారు. గిరిజన మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కార్యక్రమాలు నిర్వహించే గిరివెలుగును డీఆర్‌డీఏలో అనుసంధానం చేసే ఆలోచనను తక్షణమే రాష్ట్రప్రభుత్వం విరమించుకోవాలని సాంబమూర్తి అన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలి