
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025
● మహిళా తహసీల్దార్‌పై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు
● ఎమ్మెల్యేపై ఫిర్యాదు నేపథ్యంలో భారీగా తహసీల్దార్ కార్యాలయానికి..
● రైతులు, బాధితుల పేరుతో హడావిడి
● రాత్రికి రాత్రే సిద్ధమైన ఫిర్యాదులు
● తహసీల్దార్‌కు మతిస్థిమితం లేదని.. ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని.. ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్
వాస్తవానికి ములగ గ్రామంలో డిజిటల్ సంతకాల కోసం డబ్బులు తీసుకున్నట్లు చెప్పిన వారు ఒకరిద్దరే. మిగిలినవారంతా తమ పనులు చేయడం లేదనే గగ్గోలు పెట్టారు. అది కూడా శుక్రవారం రాత్రి నుంచే రూ.2 లక్షలు ఆమె అడిగినట్లు బయటకు వచ్చింది. ఆ డబ్బులు కూడా తహసీల్దార్‌కే ఇచ్చినట్లు ఏ ఒక్కరూ స్పష్టంగా చెప్పలేదు. టీడీపీ నాయకులు మాత్రం ఆమె డబ్బులు తీసుకున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో తహసీల్దార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, పీఓ ఎదుటే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తహసీల్దార్ డౌన్‌డౌన్ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు ఆమెను ఇక్కడ నుంచి పంపించేయాలని పట్టుబట్టారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం వచ్చిన బాధితులు ఇలా ఆగ్రహంతో ఊగిపోవడం.. ఇటువంటి డిమాండ్లు చేయడం అరుదు. తహసీల్దార్ ఫిర్యాదు నేపథ్యంలోనే విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలాంటి డ్రామాకు తెర తీశారన్న విమర్శలు వినిపించాయి. దీని వెనుక కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎవరన్న ప్రశ్నలు ఎదురయ్యాయి.
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్:
‘‘పంపించేయండి సార్ ఇక్కడ నుంచి ఆవిడను..,
వుయ్ వాంట్ జస్టిస్..,
అవినీతి తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలి..,
ఫిర్యాదు వెనక్కి తీసుకుని,
ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలి..,
తహసీల్దారు డౌన్‌డౌన్.. ఆమెను విధుల నుంచి టెర్మినేట్ చేయాలి..,
ఎమ్మార్వోకు మానసిక స్థితి సరిగ్గాలేదు..
ఆవిడను వెంటనే ఇక్కడ నుంచి
పంపించేయాలి..’’
ఇవన్నీ పార్వతీపురం తహసీల్దార్ జయలక్ష్మికి వ్యతిరేకంగా సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ అశుతోశ్ శ్రీ వాత్సవ ఎదుట పలువురు చేసిన నినాదాలు. నిజంగా తహసీల్దార్ వారిని ఇబ్బంది పెడితే.. కడుపు మండిన బాధితులెవరైనా... ఒక ఐఏఎస్ అధికారి వద్ద తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ న్యాయం చేయాలని కన్నీటిపర్యాంతమవుతారు. అంతేగానీ.. ఆమెను సస్పెండ్ చేయాలని, మతిస్థిమితం లేదని, ఇక్కడ నుంచి పంపించేయాలని, డౌన్‌డౌన్.. అంటూ నినాదాలు చేయడం బహుశా ఇక్కడే జరిగి ఉండొచ్చేమో అన్న వ్యాఖ్యలు వినిపించాయి.
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తనను అసభ్య పదజాలంతో దూషించారని స్థానిక ఎమ్మెల్యే జయలక్ష్మి ఫిర్యాదు చేసినట్లు బయటకు వచ్చిన లేఖ కలకలం రేపిన విషయం విదితమే. దీనిపై శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే విజయచంద్ర అవన్నీ ఆరోపణలని ఖండించారు. దీంతోపాటు.. తహసీల్దార్ పెద్ద అవినీతిపరురాలని వ్యాఖ్యానించారు. ములగ గ్రామంలో రైతులకు సంబంధించిన డిజిటల్ సంతకాల కోసం రూ.10 లక్షలు ఆమె డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. బాధితులంతా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తారని ప్రకటించారు. అనుకున్నట్లుగానే శనివారం ఉదయం మండలంలోని ములగ, అడ్డాపుశీల, కృష్ణపల్లి, వెంకంపేట తదితర గ్రామాల నుంచి వచ్చినట్లుగా పెద్ద సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు. ఈ క్రమంలో అక్కడ ఏం జరుగుతుందోనని కాసేపు ఉత్కంఠ రేగింది. ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఆ సమయంలో తహసీల్దార్ జయలక్ష్మి లేకపోవడంతో ఆయా గ్రామాల నుంచి వచ్చిన వారంతా కార్యాలయ ఆవరణలోనే గుమికూడారు. కాసేపటి తర్వాత సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో అశుతోశ్ శ్రీ వాత్సవ అక్కడికి చేరుకున్నారు. వారి సమస్యలు విన్నారు. విజ్ఞప్తులు స్వీకరించారు. విచారణ జరిపి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఏకరువు పెట్టిన వారంతా టీడీపీ వారే..
సబ్ కలెక్టర్‌ను చుట్టుముట్టి సమస్యలు చెప్పిన వారంతా టీడీపీ వారే కావడం గమనార్హం. ఆ పార్టీ పట్టణ, మండల నాయకులు, కాంట్రాక్టర్లు, కౌన్సిలర్లు అంతా ఒక్కొక్కరిగా తహసీల్దార్ మీద విమర్శల దాడి మొదలుపెట్టారు. ఆమె అవినీతిపరురాలంటూ చిట్టా విప్పారు. ఒక్కొక్కరితో ఒక్కో ఫిర్యాదు ఇప్పించేశారు. తహసీల్దార్ ఏ పనీ చేయడం లేదని గగ్గోలు పెట్టారు. ధ్రువీకరణ పత్రాలు, వన్‌బీలు, డిజిటల్ సంతకాలు, నోటీసుల జారీ, విచారణలో జాప్యాలు.. ఇలా సమస్యలను ఏకరవు పెడుతూ, పది నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. ప్రతి పనికీ డబ్బులు అడుగుతున్నట్లు తెలిపారు. ముందు ఆమెను ఈ మండలం నుంచి పంపించేయాలని ‘గట్టిగా’ డిమాండ్ చేశారు. మతిస్థిమితం లేని ఆవిడంటూ దుర్భాషలాడారు. ఒక మండల మేజిస్ట్రేట్ అని కూడా చూడకుండా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. మధ్యమధ్యలో కొంతమంది వృద్ధులతోనూ మాట్లాడించారు. వాస్తవానికి మాట్లాడిన వారితోపాటు.. ఇక్కడకు వచ్చిన వారిలో ఏ సమస్యలూ లేనివారూ ఉండటం గమనార్హం. మండల కార్యాలయం వద్ద సమావేశం ఉందని చెప్పి తీసుకొచ్చారంటూ కొంతమంది చెప్పడం విశేషం. గత ఏడాది పదో నెలలో ఆమె ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆమె అవినీతి చేస్తున్నారని, ఏ పనీ చేయడం లేదని చెబుతున్న టీడీపీ నాయకులకు.. ఇన్నాళ్లూ ఫిర్యాదు చేయకుండా, ఇప్పుడు ఒక్కసారిగా రావడం వెనుక, ఆరోపణలు చేయడం వెనుక కారణాలు ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముందు రోజు రాత్రి ఎమ్మెల్యే మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలనే ఇక్కడ ప్రస్తావించడం అనుమానాలకు తావిస్తోంది.
న్యూస్‌రీల్
ఆగ్రహంతో ఊగిపోతూ...

ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025

ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025