
చెత్త తొలగదు.. కంపు వదలదు
పార్వతీపురం రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ఆ వీధుల శివారుల్లో పడవేయడంతో స్థానికంగా ఉండేవారు దుర్వాసన పీలుస్తూ ఆరోగ్యపరమైన సమస్యలకు గురవుతున్నారు. క్రమం తప్పకుండా సేకరించిన చెత్తను ఆయా గ్రామాల్లోని ఉన్న చెత్త సేకరణ కేంద్రాలకు తరలించి తడి, పొడి, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసి వర్మీకంపోస్టు తయారు చేయాలి.
కానీ గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. రోజుల తరబడి చెత్తను ఒకే చోట పోగు చేసే దుస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు దృష్టిసారించి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు చెత్త నిల్వలను తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

చెత్త తొలగదు.. కంపు వదలదు