అభివృద్ధి చేతకాక అభాండాలు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేతకాక అభాండాలు

May 17 2025 6:42 AM | Updated on May 17 2025 6:42 AM

అభివృ

అభివృద్ధి చేతకాక అభాండాలు

శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025

ఆ మాటలు గుర్తున్నాయా?

●మున్సిపాలిటీ మొదటి సమావేశంలోనే

కలెక్టర్‌ నుంచి రూ.30 లక్షలు తెప్పించి

15 రోజుల్లో సాలూరు పట్టణ పబ్లిక్‌ టాయిలెట్స్‌ను మరమ్మతులు చేయించి

మహిళల ఆత్మగౌరవం కాపాడతానని మంత్రి సంధ్యారాణి చెపారు. ఏడాది కావస్తున్నా పనులు మాత్రం జరగలేదని, మంత్రికి

ఆ మాటలు గుర్తులేకపోవడం విచారకరమని కౌన్సిల్‌ సభ్యులు పేర్కొన్నారు.

●పండగ నేపథ్యంలో ఓపెన్‌ టాయిలెట్స్‌ కోసం, 80 మంది పారిశుద్ధ్య కార్మికుల ఏర్పాటు, రెండు ట్రాక్టర్లు, చెత్త నిర్వహణ పనులకు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం

తెలిపిందన్నారు. దీనిని మంత్రి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు.

●దండిగాం రోడ్డు వద్ద మంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన వాటర్‌ ట్యాంకు శిలాఫలకంపై మంత్రి పేరు మినహా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు పేర్లు రాయించకపోవడం కమిషనర్‌కు తగదన్నారు. ఆయనను తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఎమ్మెల్సీగా సంధ్యారాణి ఉన్నప్పుడు, ప్రోటోకాల్‌ పాటించలేదని మక్కువ మండలానికి చెందిన దళిత ఎంపీడీఓను సస్పెండ్‌ చేయించారని గుర్తుచేశారు. ఇప్పుడు కమిషనర్‌కు ఇది వర్తించదా అని ప్రశ్నించారు.

●గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజన్నదొర పాడేరులో మోదుకొండమ్మ అమ్మవారి పండగకు, శంబర పండగకు లక్షలాది రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదల చేయించారని, 15 ఏళ్ల తర్వాత జరిగే శ్యామలాంబ పండగకు మంత్రిగా కొనసాగుతున్న సంధ్యారాణి ఎందుకు గ్రాంటు తెచ్చుకోలేకపోయారని ప్రశ్నించారు.

●శ్యామలాంబ పండగ విజయవంతాన్ని చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, అధికారులకు పూర్తిస్థాయిలో సహాయసహకారాలు

అందిస్తామని తెలిపారు. తల్లి చల్లని కరుణ పట్టణ ప్రజలందరిపైనా ఉండాలన్నారు. కూటమి నేతలు తమ తప్పులను వైఎస్సార్‌సీపీ పాలకవర్గంపై నెట్టే కుటిల రాజకీయాలకు అమ్మవారే గట్టిగా బుద్ధిచెబుతారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు గిరిరఘు, గొర్లె జగన్‌మోహన్‌రావు, సింగారపు ఈశ్వరరావు, సత్యవతి, హరి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ వచ్చిన ఏనుగులు

కొమరాడ: నాగవళి నది ఆవల ఒడిశావైపు సంచరించిన ఏనుగులు గురువారం అర్ధరాత్రి నది దాటి దుగ్గి మీదుగా ఆర్తాం గ్రామ పరిసరాలకు చేరుకున్నాయి. గుణానపురం, దుగ్గి, కళ్లికోట తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి పూట ప్రయాణం చేసేవా రు టేకర్స్‌ నుంచి ఏనుగుల సంచారం సమచా రం తెలసుకోవాలని సూచించారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.

అక్టోబర్‌ నాటికి

గృహనిర్మాణాలు పూర్తి చేయాలి

సీతంపేట: గృహనిర్మాణాలను అక్టోబర్‌ నాటికి పూర్తిచేయాలని ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పలు గ్రామాల్లో పీఎం జన్‌మన్‌ పథకంలో మంజూరైన ఇళ్ల పనులను శుక్రవారం పరిశీలించారు. పెద్దగూడ, మండ, దీసరిగూడ గ్రామాలను సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. బిల్లులు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నా రు. ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్లకు బిల్లులు ఈ నెలాఖరుకు చెల్లించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బీబీ మిశ్రో, హౌసింగ్‌ ఏఈ వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎంఈఓ బదిలీలు చేపట్టాలి

పార్వతీపురంటౌన్‌: రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ఎంఈఓలకు బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఎంఈఓ అసోషియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం విద్యా శాఖ మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు శుక్రవారం లేఖ రూపంలో విన్నవించామన్నా రు. ఎంఈఓలుగా పని చేస్తున్న వారిలో చాలామంది 2017 నుంచి ఒకే ప్రదేశంలో పనిచేస్తు న్నా బదిలీలు నిర్వహించలేదన్నారు. టీచర్ల బదిలీ ప్రక్రియ పూర్తయిన తరువాత ఎంఈఓ లు నూతన ప్రదేశాల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వా లని లేఖలో కోరినట్టు తెలిపారు.

పైడితల్లికి స్వర్ణపుష్పార్చన

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి పైడితల్లికి శుక్రవారం స్వర్ణ పుష్పార్చన చేశారు. వేకువజాము నుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు అచ్యుతశర్మ, శివప్రసాద్‌ శాస్త్రో క్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ఇన్‌చార్జి ఈఓ ప్రసాద్‌ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

సాలూరు:

న్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయలేక, అభివృద్ధి పనులు చేతకాక కూటమి నేతలు అబద్ధాలు చెబుతూ ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులపై అభాండాలు వేస్తున్నారని సాలూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ, కౌన్సిలర్లు ఆరోపించారు. మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సంధ్యారాణి ఎమ్మెల్యేగా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన సాలూరు మున్సిపాలిటీలో 15 ఏళ్ల తరువాత జరుగుతున్న శ్యామలాంబ అమ్మవారి పండగ కోసం ప్రభుత్వం నుంచి నిధులు సాధించలేకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో 40 మున్సిపాలిటీలకు అప్పు రూపేణా (రీయింబర్స్‌మెంట్‌) రూ.2కోట్లు చొప్పు న మంజూరైందని, సాలూరు మున్సిపాలిటీకి మంజూరైన రూ.2కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చేయడం మంత్రికి తగదన్నారు. పండగ ఏర్పాట్లలో అలసత్వంపై భక్తుల నుంచి విమర్శలు వస్తుండడంతో ఆ నిధులను పండగ కోసం వినియోగిస్తున్నారన్నారు. పనుల పేరుతో నిధులు కై ంక్యర్యం చేసేందుకు పలువురు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్న విషయాన్ని పట్టణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ నెల 14న జరి గిన అత్యవసర మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో అజెండాలో పెట్టిన అన్ని అంశాలకు నిబంధనల ప్రకారం ఆమోదం తెలిపినట్టు తెలిపారు. ఈ విషయాన్ని మరచి పండగ పనులు అడ్డుకుంటున్నారంటూ మంత్రి సంధ్యారాణి కౌన్సిల్‌ను విమర్శించడం విచారకరమన్నారు. చైర్‌పర్సన్‌పై టీడీపీ మండలాధ్యక్షుడు నిమ్మాది చిట్టి దుర్బాషలాడుతూ దౌర్జనం చేసినా సాటి మహిళగా మంత్రి మందలించకపోవడం బాధాకరమన్నారు.

పనుల్లో జాప్యం ఎవరిది?

మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల్లో జాప్యం మంత్రి, కమిషనర్‌దేనని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఏ వార్డుకు ఎంత కేటాయించాలి, ఏ పనులు చేపట్టాలనే అంశంపై మంత్రి సూచించక, అధికారులు పనుల జాబితా తయారుచేసి అజెండాలో పెట్టక పోవడంతో ఆలస్యమైందన్నారు. ఆ నెపాన్ని మున్సిపల్‌ కౌన్సిల్‌పై నెట్టే యత్నం శోచనీయమన్నారు. రూ.18 లక్షల ఖర్చుతో చీపుర్లు, బ్లీచింగ్‌ పౌడర్‌, ఇతర సామగ్రి కొనుగోలుకు కాంట్రాక్టర్‌ వానపల్లి శంకరరావు, ఇతరుల పేరున అజెండాలలోనే ఆమోదించాలని ఆర్డర్‌ వేసినది ఎవరో అందరికీ తెలుసన్నారు. మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం టెండర్లు పిలవకుండా శంకరరావు, ఇతరులకు అప్పగించేందుకు మంత్రి ఆదేశాలను ఆమోదించలేదనే తమపై నిందలు మోపుతున్నారని వాపోయారు.

న్యూస్‌రీల్‌

కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

శ్యామలాంబ జాతరకు నిధులు విదల్చని ప్రభుత్వం

మంత్రి నిర్లక్ష్యంతో రూ.2కోట్ల అప్పుతో పండగ పనులు!

పనుల పేరుతో అప్పుడబ్బును,

విరాళాలను దోచుకునే ప్రయత్నాలు

మహిళపై దౌర్జనం చేసిన టీడీపీ

నాయకుడిని మంత్రి

మందలించకపోవడం శోచనీయం

మంత్రి తీరుపై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల అసహనం

అభివృద్ధి చేతకాక అభాండాలు 1
1/3

అభివృద్ధి చేతకాక అభాండాలు

అభివృద్ధి చేతకాక అభాండాలు 2
2/3

అభివృద్ధి చేతకాక అభాండాలు

అభివృద్ధి చేతకాక అభాండాలు 3
3/3

అభివృద్ధి చేతకాక అభాండాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement