
తనిఖీలా.. విచారణా?
సాక్షి, పార్వతీపురం మన్యం: వివాదాలతో కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న పార్వతీపురం పురపాలక సంఘం కార్యాలయాన్ని ఆ శాఖ ఆర్డీ రవీంద్ర శుక్ర వారం సందర్శించారు. సిబ్బంది పనితీరు, వివిధ అంశాలపై సమీక్షించారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఆయన జిల్లాకు వచ్చినట్లు చెబుతున్నప్పటికీ.. ఇటీవల కమిషనర్ తీరు పట్ల వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టారని కార్యా లయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక ల కోడ్ తర్వాత పార్వతీపురం పురపాలక సంఘంలో సాధారణ, బడ్జెట్ సమావేశాలు నిర్వహించలే దు. మార్చి 8వ తేదీతో కోడ్ ముగిసినా.. ఎన్నో మార్లు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చైర్ పర్సన్, వైస్ చైర్మన్లు కోరినా కమిషనర్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ సీపీకి చెందిన సభ్యులు దీనిపై పత్రికా ముఖంగా ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు.. అధికారులకూ ఫిర్యాదు చేశా రు. సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల అభివృద్ధి పనులకు ఆమోదం లభించడం లేదని.. కమిషనర్ కూడా తమ పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదని తెలిపారు. ఇదే విషయమై శుక్రవారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీ రవీంద్రకు కమిషనర్ వెంకటేశ్వర్లు సమక్షంలోనే మరోసారి ఫిర్యాదు చేశారు. తగు చర్యలు తీసుకోవాలని కోరా రు. ఇదే సమయంలో పట్టణంలో నెలకొన్న నీటి ఎద్దడి, ఆక్రమణలు, ఇతర సమస్యలను ఆర్డీ దృష్టికి తీసుకెళ్లిన పలు ప్రజాసంఘాల నాయకులు.. కమిషనర్ తీరుపైనా ఏకరవు పెట్టడం గమనార్హం. అధికార పార్టీ ఎమ్మెల్యేకు తొత్తులా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సాధారణ తనిఖీలే..
ఇదే విషయమై ఆర్డీ వద్ద ప్రస్తావించగా.. నెలవారీ సాధారణ తనిఖీల్లో భాగంగానే వచ్చానని, పలు అంశాలపై సమీక్షించానని వివరించారు. చైర్ పర్స న్, ఇతర సభ్యులు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, విచారణ చేపడతామని చెప్పారు.
మున్సిపల్ కార్యాలయానికి ఆర్డీ..
కమిషనర్‌పై ఫిర్యాదు చేసిన పాలకవర్గ సభ్యులు