
సాగునీటి పనులకు ప్రాధాన్యం
గరుగుబిల్లి: జాతీయ ఉపాధిహామీ పథకం పనుల్లో సాగునీటి పనులకు ప్రాధాన్యమిస్తున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. గరుగుబిల్లి మండలం కొంకడివరంలో ఉపాధిహామీ పథకం నిధులతో చేపట్టే చెరువు ఫీడర్ నిర్మాణం పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఉపాధిహామీ వేతనదారులతో మాట్లాడారు. వేతనాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. జిల్లాలో చెరువులను అనుసంధానిస్తూ 120 పనులు మంజూరయ్యాయన్నారు. కొంకడివరంలో బోనివాని చెరువులోకి వచ్చే ఫీడర్ చానల్‌కు గతంలో గండి కొట్టినచోట రూ.8 లక్షల వ్యయంతో పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అల్లు అప్పలనాయుడు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, జలవనరుల శాఖ ఈఈ ఆర్.అప్పలనాయుడు, ఉదయభాస్కర్, ఎంపీడీఓ జి.పైడితల్లి, తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని
విజయవంతం చేయాలి
పార్వతీపురంటౌన్: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ జిల్లా అధికారులను టెలీకాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. బీట్‌దిహీట్ శీర్షికన ఈనెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు మండల స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండడం, చలి వేంద్రాలను ఏర్పాటుచేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్