
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
వీరఘట్టం: మండలంలోని చిట్టపులివలస, ఎం.రాజపురం గ్రామాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. చిట్టపులివలస గ్రామానికి చెందిన కుప్పిలి పాపారావు(69) బుధవారం సాయంత్రం తన పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే ఎం.రాజపురం గ్రామానికి చెందిన కొప్పర రాము (54) గురువారం తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకుని ఇంటికి వస్తుండగా తెగిపడిన విద్యుత్ వైరును గమనించకపోవడంతో అది కాలికి తగిలి షాక్‌కు గురై తన ఇంటి ముందరే మృతిచెందాడు. ఈ ప్రమాదాలపై ఫిర్యాదుల మేరకు ఎస్సై జి.కళాధర్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
రామభద్రపురం: మండలకేంద్రానికి చెందిన వ్యక్తి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక చింతల వీధికి చెందిన చింతల రామినాయుడు(80) కొన్ని నెలలుగా కడుపు నొప్పితో ఇబ్బందులు పడుతున్నాడు. ఆ బాధను తట్టుకోలేక ఈ నెల 7వ తేదీన తన పొలంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విసయనగరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి