
జంఝావతి రబ్బర్ డ్యామ్ తనిఖీలు
కొమరాడ: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్‌రెడ్డి ఆదేశాల మేరకు కొమరాడ మండలంలోని జంఝావతి నదిపై నిర్మాణం చేసిన జంఝావతి రబ్బర్ డ్యామ్‌తో పాటు రిజ్వయిర్ పరిసరాల్లో పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఎస్సై కె.నీలకంఠం ఆధ్వర్యంలో బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎస్సై నీలకంఠం మాట్లాడుతూ దేశ సరిహద్దులో ఏర్పడిన యుద్ధ వాతా వరణం నేపథ్యంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రిజర్వాయర్ పరిధిలో ఎలాంటి అపరిచిత వ్యక్తులు కనిపించినా స్థానిక పోలీసులకు సమచారం ఇవ్వాలని కోరారు. రబ్బర్ డ్యామ్ పరిసరాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి.