
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
● డీఆర్‌ఓ హేమలత
● పీజీఆర్‌ఎస్‌కు 98 వినతులు
పార్వతీపురంటౌన్: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఆర్జీల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా అధికారులు పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, పరిష్కారంలో అర్జీలు రీ ఓపెన్ కారాదని అధికారులను కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ డా.పి.ధర్మచంద్రారెడ్డి భాగస్వామ్యమై 98 మంది అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని, నాణ్యత గల ఎండార్స్ మెంట్ అందజేయాలని అధికారులకు సూచించారు.
చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలి
పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులపై చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి ఫిర్యాదులకు సంబంధించి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ శాఖ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి స్వయంగా స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఫిర్యాదులు వాస్తవాలైతే చట్టపరమైన చర్యలతో పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ సిబ్బందికి ఎస్పీ ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదులలో ప్రధానంగా కుటుంబ కలహాలు, భర్త, అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూలు, ప్రేమ పేరుతో మోసాలపై పలు ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 14 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీసీఆర్‌బీ ఎస్సైలు ఫకృద్దీన్, జగదీష్‌నాయుడు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 26 వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 26 వినతులు వచ్చాయి. దబర పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని ప్రసాదరావు తదితరులు కోరారు. మేడఒబ్బంగి, కొండాడ గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కరించాలని అక్కడి గిరిజనులు అర్జీ ఇచ్చారు. సెల్‌టవర్ నిర్మించాలని లాడ గ్రామస్తులు కోరారు. ఆర్‌ఓఎఫ్ ఆర్ భూములు సర్వే చేసి పట్టాలు ఇప్పించాలని పొగడవెల్లి గ్రామస్తులు విన్నవించారు. అంబలిగండి నుంచి కుంబి గ్రామానికి రహదారి నిర్మించాలని ఆయా ప్రాంతాల గిరిజనులు కోరారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం