‘దిశ’ నుంచి ‘శక్తి’ | - | Sakshi
Sakshi News home page

‘దిశ’ నుంచి ‘శక్తి’

Mar 15 2025 1:41 AM | Updated on Mar 15 2025 1:40 AM

ఆపదలో ఉన్న మహిళకు భరోసా

● రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో శక్తి టీమ్స్‌ పహారా

విజయనగరం క్రైమ్‌: మహిళలకు భద్రత ఇచ్చేందుకు నాడు జగన్‌ ప్రభుత్వం హయాంలో వినూత్న పంథాలో ‘దిశ‘ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఆపదలో ఉన్న అమ్మాయి, మహిళ, ఉద్యోగిని ఇలా ఏ రంగంలో ఉన్న ఆడవారికై నీ గత జగన్‌ ప్రభుత్వం ‘దిశ’ యాప్‌ను ప్రవేశపెట్టి భరోసా, భద్రత కల్పించింది. దాని స్థానంలో ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ‘శక్తి‘మొబైల్‌ యాప్‌ను విడుదల చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ‘శక్తి‘ యాప్‌ను ప్రతి ఒక్క అమ్మాయి, మహిళ, గృహిణి, ఉద్యోగిని వినియోగించుకోవాలని ఎస్పీ వకుల్‌ జిందల్‌ పిలుపునిచ్చారు. మహిళలకు రక్షణ కవచంగా నిలిచే ‘శక్తి‘ మొబైల్‌ యాప్‌ను స్వచ్ఛందంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళల భద్రతకు ప్రత్యేకంగా ‘శక్తి‘ మొబైల్‌ యాప్‌ను ప్రతి మహిళ, యువత తన మొబైల్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ‘శక్తి’ యాప్‌ మొబైల్‌ ఫోన్‌లో నిక్షిప్తమై ఉంటే ఆపద సమయాల్లో పోలీసుల సహాయం సులువుగా పొందవచ్చని చెప్పారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయాల్లో ‘శక్తి‘ యాప్‌ రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు. ఆపద సమయాల్లో సదరు మహిళలు పోలీసులకు సమాచారం అందించలేని పరిస్థితుల్లో కూడా ఈ మొబైల్‌ యాప్‌ పని చేస్తుందని చెప్పారు. అటువంటి సమయాల్లో కేవలం మొబైల్‌ ఫోన్‌ను గాలిలో షేక్‌ చేసినా, వారున్న లొకేషను, ఆడియో, వీడియో వివరాలు దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు చేరుతాయని, తద్వారా తమ సిబ్బంది సకాలంలో స్పందించి, కారకులైన వ్యక్తులపై చర్యలు చేపట్టి, బాధితులకు రక్షణగా నిలిచే అవకాశం ఉంటుందన్నారు. మహిళలు, విద్యార్థినులు తాము ఆపదలో ఉన్నామని భావిస్తే యాప్‌లోని ఎస్‌ఓఎస్‌. బటన్‌ ప్రెస్‌ చేయాలని సూచించారు. రాత్రి సమయాల్లో మహిళలు నైట్‌ షెల్టర్లలో వేచి ఉండేందుకు దగ్గరలో ఉన్న నైట్‌ షెల్టర్ల వివరాలు, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, హక్కులు, సమీపంలోని పోలీస్‌స్టేషన్ల ఫోన్‌ నంబర్లు, హెల్ప్‌లైన్‌ నంబర్లు అందుబాటులో ఉంటాయని ఎస్పీ వకుల్‌ జిందల్‌ తెలిపారు. కొత్తగా రూపొందించిన శక్తి టీమ్స్‌ జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్సులు, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లు, కళాశాలలను సందర్శించి, మహిళలు, విద్యార్థినులకు శక్తి మొబైల్‌ యాప్‌ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement