ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
విజయనగరం క్రైమ్: టాయిలెట్‌కి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.ఈ ఘటనకు సంబంధించి వన్‌టౌన్ పోలీసులు శనివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డు సున్నంబట్టి వీధి సమీపంలో నివాసం ఉంటున్న గంగాధర్ (30) తల్లితో కలిసి ఆటోలో గూడ్స్‌షెడ్ వైపు వెళ్తున్నాడు. రైల్వేఅండర్ బ్రిడ్జి వద్దకు వచ్చే సరికి టాయిలెట్‌కి వెళ్లివస్తానని ఆటోను పక్కన ఆపించి, రోడ్డు దాటే క్రమంలో అటునుంచి వేగంగా వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్ట్టడంతోతలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్సై నరేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


