
● ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర
సాలూరు: మున్సిపాలిటిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రిని పట్టణంలో ఆయన గృహంలో మున్సిపల్ కమిషనర్ జయరాం ఆదివారం కలిశారు. మున్సిపాలిటీలో జనరల్ ఫండ్, 15వ ఆర్థిక సంఘం, గడప గడపకు మన ప్రభుత్వం తదితర నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు, టిడ్కో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
15న కుస్తీ ఎంపిక పోటీలు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండగుంపాం గ్రామంలో ఈ నెల 15న కుస్తీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని కుస్తీ అసోసియేష న్ జిల్లా కార్యదర్శి పతివాడ లక్ష్మణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో చిత్తూరు జిల్లాలో రాష్ట్ర చాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా స్థాయిలో ఎంపిక లు నిర్వహిస్తున్నామని ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 15న ఉదయం 8 గంటలకు కొండగుంపాం గ్రామానికి చేరుకోవాలన్నారు. పూర్తి వివ రాలకు 98486 20959 నంబరును సంప్రదించాలని సూచించారు.
దివ్యాంగులను ఆర్థిక
స్థితిమంతులుగా తీర్చిదిద్దాలి
● కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ చౌదరి
కొత్తవలస : దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను సమకూర్చడంతో పాటు వారిని ఆర్థిక స్థితిమంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ కేవీ చౌదరి అన్నారు. మండలంలోని మంగళపాలెం గ్రామ సమీపంలో గల శ్రీగురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 700 మందికి దుప్పట్లు, 50 మంది దివ్యాంగులకు వీల్‌చైర్స్, ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు తదితర సామగ్రిని కేవీ చౌదరి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్థికంగా ఎదిగిన రోజు మరొకరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని, వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. అందుకు తగ్గ సహకారం గురుదేవా చారిటబుల్ ట్రస్టు ద్వారా అందుతోందన్నారు. సాయం పొందిన వారు మరొకరికి సాయం చేసే స్థాయికి ఎదగా లని సూచించారు. ట్రస్టు చైర్మన్ జగదీష్‌బాబు మాట్లాడుతూ తమ ట్రస్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌ఘడ్, తెలంగాణ, కర్నాటక రా ష్ట్రాల్లో సేవలు అందజేస్తున్నామని తెలిపారు. సుమారు లక్షా 18 వేల మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించామన్నారు. స్టీల్ ఎక్ఛేంజి ఇండియా లిమిటెడ్ సీఎండీ బండి సురేష్‌కుమార్ మాట్లాడుతూ గురుదేవా ట్ర స్టు సేవలు నిరూపమన్నారు. ట్రస్టుకు తమ కర్మాగారం నుంచి పూర్తిగా సహకరిస్తామన్నా రు. ఓఎన్‌జీసీ మాజీ అధికారి అరుమగం, ప్రముఖ వైద్యుడు ఆనందకృష్ణ పాల్గొన్నారు.
జాతీయస్థాయి ఖోఖో పోటీలకు జొన్నవలస విద్యార్థి
విజయనగరం రూరల్: మండలంలోని జొన్నవల స జెడ్పీ ఉన్నత పాఠశాల కు చెందిన ఎనిమిదో తర గతి విద్యార్థి జాతీయ స్థా యి సబ్ జూనియర్ ఖోఖో పోటీలో పాల్గొనే రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించాడు. గత నెల 26 నుంచి 28 వరకు గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయనగ రం జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించింది. జిల్లా జట్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డి. యుగంధర్ రాష్ట్ర ఖోఖో జట్టులో స్థానం సంపాదించాడు. దీంతో ఈ నెల 13 నుంచి 17 వరకు కర్ణాటక రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో యుగంధర్ రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించనున్నాడని పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు విద్యార్థిని హెచ్‌ఎంతో పాటు జెడ్పీటీసీ సభ్యుడు కెల్ల శ్రీనివాసరావు, జొన్నవలస గ్రామస్తులు అభినందించారు.

మాట్లాడుతున్న సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమిషనర్ చౌదరి