విజయనగరం రూరల్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్–సి ఉద్యోగాలైన లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి డి.అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎస్‌ఎస్‌సీ.ఎన్‌ఐసి.ఐఎన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 8 చివరి తేదీ అని తెలిపారు. ఈ నెల 10 లోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 10 కేంద్రాల్లో ఆగస్టు నెలలో పరీక్ష జరుగుతుందని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.