న్యూస్‌రీల్
విచారణను అడ్డుకునే కుట్ర
ఘనంగా గంగమ్మ కల్యాణం
పల్నాడు
రంగురాళ్ల కేసు నీరుగార్చేందుకు ‘పచ్చ’కుట్రలు
సాక్షి, నరసరావుపేట: అక్రమంగా అటవీ సంపదను దోచుకుంటున్న ముఠాను పట్టుకున్న విజిలెన్స్, ఆటవీశాఖ అధికారులను బెదిరించి రంగురాళ్ల కేసును నీరుగార్చేందుకు అధికారపార్టీ నేతలు తమ అసలు రంగు బయటకపెట్టుకుని పచ్చ కుట్రలకు తెరలేపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శంకరపురం గ్రామ సమీపంలో దొరికే రంగురాళ్ల(క్రిస్టల్, క్వార్‌జ్జ్)ను దాచేపల్లి సమీపంలోని ఓ గోడౌన్‌లో దాచగా గత శుక్రవారం రాత్రి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈక్రమంలో శంకరపురం అటవీసమీపంలోని పలు గ్రామాల్లోని కూలీల ఇళ్లలో భారీ ఎత్తున రంగురాళ్లు నిల్వ చేశారన్న సమాచారంతో విజిలెన్స్, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అయితే ఈ సమాచారం తెలియడంతో రంగురాళ్లు అధికారుల కంటపడకుండా రంగురాళ్ల మాఫియా జాగ్రత్తపడింది. విజిలెన్స్, అటవీ అధికారులు, సిబ్బంది సోదాలు నిర్వహించే సమయంలో టీడీపీ నేతల సన్నిహితంగా ఉండే కూలీలు హంగామా సృష్టించారు. సోదాలు నిర్వహించకూడదంటూ ఎదురుతిరిగారు.
రంగురాళ్ల తవ్వకాలకు స్థానిక టీడీపీ నేతలకు ఓ ఫారెస్ట్ అధికారి, కొందరు సిబ్బంది బాగా సహకరిస్తున్నట్టు సమాచారం. సదరు ఫారెస్టు అధికారికి తెలియకుండా దాడులు నిర్వహించి రంగురాళ్ల పట్టుకోవడంతో అధికారపార్టీ నేతలతో కలసి కుట్రలకు తెరలేపినట్టు ఆ శాఖ అధికారులే చెప్పుకొస్తున్నారు. ఇందులో భాగంగా భట్రుపాలెంకు చెందిన కొందరు కూలీలతో సోదాలు నిర్వహించిన అధికారులపై దాచేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. షెడ్యూల్ తెగలకు చెందిన తమ ఇళ్లలోకి అటవీశాఖ అధికారులు, సిబ్బంది ప్రవేశించి కూలం పేరుతో దూషించి దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారట.
● దీనిపై దాచేపల్లి సీఐ రాజేష్‌ను వివరణ అడగగా ఫిర్యాదు అందిందని, దానిపై విచారణ చేస్తున్నామని ‘సాక్షి’కి తెలిపారు. అయితే సోదాలు నిర్వహించే సమయంలో ఒకటి రెండు నిబంధనలు పాటించలేదన్న సాకుతో ఏ తప్పు చేయకపోయినా మాపై ఫిర్యాదుచేయడం ఏంటని అటవీశాఖ అధికారులు వాపోతున్నారు. ఇలా అయితే ఉద్యోగాలు ఎలా చేయగలమని, రంగురాళ్ల మాఫియా ఏ స్థాయిలో ఉందో చెప్పడానికే ఇదే నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగురాళ్ల మాఫియాతో చేతులు కలపి అటవీ సంపదను దోచుకోవడమే కాక సొంత సిబ్బందిపైనే ఫిర్యాదు చేయించిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. అటవీశాఖ సిబ్బందిపై ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావును అటవీశాఖ అధికారులు కలసినట్టు సమాచారం.
రంగురాళ్ల నిల్వలున్నాయని పలువురు
కూలీల ఇళ్లలో సోదాలు నిర్వహించిన
విజిలెన్స్, అటవీ అధికారులు
కులం పేరుతో తమను దూషించారంటూ
అధికారులపై కూలీలతోనే ఫిర్యాదు
చేయించిన రంగురాళ్ల మాఫియా
అక్రమ కేసుపై పల్నాడు ఎస్పీని
కలసిన అటవీ శాఖ అధికారులు
రంగురాళ్ల కేసులో తెరవెనుక ఉన్న
టీడీపీ నేతలు, సహకరించిన
అధికారుల పాత్రపై విచారణను
అడ్డుకునేందుకు కుట్ర
అధికార పార్టీ నేతలు, అటవీ శాఖ
అధికారులు కలసి రెండేళ్లలో
రూ.కోట్ల విలువైన రాళ్లను
విక్రయించిన వైనం
రంగురాళ్లు పట్టుబడటం, దాని వెనుకున్న అధికారపార్టీ నేతలు, అవినీతి అధికారుల గుట్టు భయటపడుతుందన్న భయంతో కుట్రలకు తెరతీశారు. ఏకంగా అటవీశాఖ అధికారులపైనే ఫిర్యాదులు ఇవ్వడం ఆశ్చార్యానికి గురిచేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రంగురాళ్ల మాఫియా కోట్లాది రూపాయల విలువచేసే రాళ్లు సేకరించి అక్రమార్జన చేశారు. ఇవన్ని బయటపడకుండా మాఫియా కుట్రలకు తెరలేపిందని సమాచారం. మరోవైపు దాచేపల్లి మండలంలోని శంకరపురం అటవీప్రాంతానికి ఆనుకొని ఉన్న కాట్రపాడు, భట్రుపాలెం తదితర గ్రామాలలో భారీస్థాయిలో రంగురాళ్లు ఉన్నాయని, వాటిపై దాడులు చేస్తే రంగురాళ్లు పెద్ద ఎత్తున బయటపడతాయని స్థానికులు చెప్పుకొస్తున్నారు.
పిడుగురాళ్ల: పట్టణంలోని గంగమ్మ తల్లి దేవస్థానంలో సోమవారం వైభవంగా కల్యాణం నిర్వహించారు. వేద పండితులు అగ్నిహోమం నిర్వహించారు.


